నేడు కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు

Judgment on Kejriwal’s bail petition today

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు రిజర్వులో పెట్టిన తీర్పును ఈ రోజు రానుంది. లిక్కర్ ఈడీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్‌ ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు. గతవారం కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదానులు ముగియడంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది.

”ఎక్సైజ్‌ కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్‌. ఆయన్ను విడుదల చేస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారు. ఆయన అరెస్టయితేనే ఈ కేసు విచారణ ముగింపునకు వస్తుంది. నెలలోగా చార్జిషిటు వేస్తాం’అని సీబీఐ లాయర్‌ డీపీ సింగ్‌ తెలిపారు. కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు రాకుండా చేసేందుకే సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారని ఆయన తరఫు సీనియర్‌ లాయర్‌ అభిషేక్‌ మను సింఘ్వి వాదించారు. ఊహాకల్పనలతోనే కేజ్రీవాల్‌కు అరెస్ట్‌ చేశారే తప్ప, ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ఎటువంటి ఆధారాలు లేవన్నారు. వాదనలు విన్న అనంతరం జస్టిస్‌ నీనా బన్సన్‌ కృష్ణ తీర్పును రిజర్వులో ఉంచుతూ ఆదేశాలిచ్చారు.