తమిళ్ డైరెక్టర్ వెట్రిమారన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్..

ఎన్టీఆర్​​ హీరోగా స్టార్​​ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. సెప్టెంబరు 27న గ్రాండ్​గా రిలీజ్ కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే దేవర నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్​లు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ట్రైలర్​ అంచనాలను మరింత పెంచేసింది. ఇందులో ఎన్టీఆర్​ లుక్, యాక్షన్, డైలాగ్స్ అన్నీ ఫ్యాన్స్​కు తెగ నచ్చేశాయి. ఇక సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుండడం తో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్ చేసారు.

మంగళవారం చెన్నైలో ‘దేవర’ మూవీ ప్రమోషన్లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అసురన్’ దర్శకుడు వెట్రిమారన్ తాను అభిమానించే వారిలో ఒకరని .. ఆయన ఓకే అంటే నేరుగా తమిళంలో సినిమా చేసేందుకు సిద్ధమన్నారు. అవసరమైతే తెలుగులో డబ్బింగ్ చేద్దామన్నారు. అలాగే తాము టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్, సాండల్ వుడ్ ఇలా వేర్వేరు భాషల్లో నటిస్తున్నా అందరిని ఏకం చేసేది ఎప్పటికీ సినిమానే అని ఎన్టీఆర్ చెప్పారు. బాక్సాఫీస్ వద్ద సినిమా సత్తా చాటితే భాష సరిహద్దులు చెరిగిపోతాయన్నారు. తెలుగు సినిమాకు చెన్నై సోపానం వంటిదని పేర్కొన్నారు. మరోవైపు అనిరుధ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమా చేయాలని ట్రెండ్ చేసినప్పుడే తమ కాంబినేషన్ కుదిరిందని తెలిపారు.