తన కొడుకు అరెస్టు పై స్పందించిన జోగి రమేష్‌

Jogi Ramesh reacts on his son arrest

అమరావతి: తన కొడుకు అరెస్ట్‌ పై జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌ను అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. అయితే… జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌ను అరెస్టు చేసి గొల్లపూడి ఏసీబీ ఆఫీస్‌కు తరలించారు అధికారులు. దీంతో కొడుకు వెనకే ఏసీబీ ఆఫీస్‌కి వెళ్లారు తండ్రి జోగి రమేష్. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. ఎమీ తెలియని తన కుమారుడిని అరెస్ట్ చేసి జైలులో పెట్టాలనుకుంటున్నారని ఆగ్రహించారు.

తాను బలహీన వర్గాల నుంచి ఎదిగిన నాయుకుడినని తన కుంటుంబంపై ప్రభుత్వం కక్షసాంధింపు చర్యలకు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఇవాళ విచారణకు వెళ్తున్నాను… సాయంత్రం 4 గంటలకు మంగళగిరి డీఎస్పీ కార్యాలయానికి వెళ్తున్నానని చెప్పారు. ఆ సమయంలో వాడిన మొబైల్ తీసుకు రమ్మని చెప్పారు… విచారణకు సహకరిస్తానన్నారు. నేను దాడి చేయటానికి వెళ్ళలేదు…నిరసన తెలియ జేయ డానికి వెళ్ళాను అంటూ వ్యాక్యానించారు.