మరో రెండు వారాల్లో జాబ్ నోటిఫికేషన్ – కాంగ్రెస్ సర్కార్

పార్లమెంట్ ఎన్నికల కారణంగా ప్రజా పాలనకు బ్రేకులు పడ్డాయని మరో రెండు వారాల్లో జాబ్ నోటిఫికేషన్ వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ వెల్లడించింది. గత కొద్దీ రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఎవరైతే కాంగ్రెస్ కు జై కొట్టారో..ఇప్పుడు వారే రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఫై విమర్శలు కురిపిస్తున్నారు. పలు డిమాండ్స్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో జాబ్ నోటిఫికేషన్ ఫై కాంగ్రెస్ సర్కార్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతి ఏటా నోటిఫికేషన్‌లతో జాబ్ క్యాలెండర్‌ విడుదల చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇదే సందర్బంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఫై విమర్శలు కురిపించింది

కేటీఆర్ నిరుద్యోగుల గురించి మాట్లాడటం ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లు’ ఉందని సెటైర్లు వేసింది. పరీక్షలను పారదర్శంగా నిర్వహించలేని బీఆర్‌ఎస్ ప్రభుత్వం, యువత దశాబ్ద కాలాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టింది. TGPSC భర్తీ చేసే గ్రూప్‌-1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు గురుకులాలు, పోలీస్, వైద్య నియామక బోర్డుల నోటిఫికేషన్లు, ఇతర విభాగాల పోస్టులన్నింటినీ సంబంధించిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనుంది. ఉద్యోగ క్యాలెండర్‌ విడుదలపై నిర్ణయం తీసుకొన్నట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసెందుకు సంబంధిత విభాగాలు ఎప్పటికప్పుడు ఖాళీల్ని గుర్తించాలని TGPSC లేఖలు రాసింది. దీంతో ఖాళీల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఏటా గ్రూప్‌-1, 2, 3, 4 సర్వీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌ తప్పనిసరిగా ఉండాలని సీఎం పేర్కొన్నారు.