jK haryana results

జమ్మూ లో కాంగ్రెస్ ..హర్యానా లో బిజెపి విజయం

కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లారు హర్యానా ప్రజలు..జమ్మూ & హర్యానా లో కాంగ్రెస్ విజయం కహాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పడం తో కాంగ్రెస్ శ్రేణులు ఉదయమే సంబరాలు మొదలుపెట్టారు. కానీ హర్యానా లో మాత్రం ఓటర్లు షాక్ ఇచ్చారు. అక్కడ మరోసారి బిజెపికి పట్టం కట్టారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్​ కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఎన్​సీ 41 చోట్ల, కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయ దుంధుబి మోగించాయి. బీజేపీ 29 సీట్లను సొంతం చేసుకుంది. పీడీపీ మూడు స్థానాలకు పరిమితమైంది. 10 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా జమ్ముకశ్మీర్ ఫలితాలు వెలువడ్డాయి.

హరియాణాలో అధికార బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మెజారిటీ మార్క్ కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఆరంభంలో ఆధిక్యంలోకి వచ్చినా కాంగ్రెస్ తర్వాత వెనుబడి రెండో స్థానానికే పరిమితమైంది.

మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హరియాణాలో కాంగ్రెస్​ 50 నుంచి 60 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్​ అంచనా వేశాయి. బీజేపీకి 20-30 మధ్యలో సీట్లు వస్తాయని తెలిపాయి. ఇక ఈ ఎన్నిక్లలో బీజేపీ హ్యాట్రిక్​కు బ్రేక్ పడుతుందని అని అంతా అనుకున్నారు. కానీ ఫలితాల ట్రెండ్ మొత్తం మారిపోయింది. ఇక ఎన్నికల్లో ఎప్పడూ ఓవర్​ కాన్ఫిడెన్స్​ ప్రదర్శనించకూడదని, హరియాణా ఎలక్షన్స్​ ద్వారా గుణపాఠం నేర్చుకున్నట్లు ఆమ్​ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్ తెలిపారు. ఏ ఎన్నికనూ తేలికగా తీసుకోకూడదన్న కేజ్రీవాల్​, ప్రతి సీటు చాలా కఠినమైనదని చెప్పారు. ఆప్​ మున్సిపల్​ కౌన్సిలర్లను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Related Posts
అమెరికాలో వణికిపోతున్న భారతీయులు
immigrants

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ప్రధానంగా మెక్సికో Read more

సీఎం బంగ్లాలో క్షుద్రపూజల కలకలం
maharastra cm

మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసం ‘వర్ష’ లో క్షుద్రపూజలు జరిగాయంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం పదవిలో తానే కొనసాగాలనే ఆకాంక్షతో Read more

జమ్ము కశ్మీర్ మిస్టరీ మరణాలకు కారణాలు: కేంద్రమంత్రి
jitendra singh

జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామంలో అంతుచిక్కని మరణాలు సంభవిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నెలన్నర రోజుల వ్యవధిలోనే మొత్తంగా 17 మంది ప్రాణాలు Read more

భద్రాద్రి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విరాళం
Donation by Telangana Grame

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రూ.1,02,322 విరాళాన్ని అందించింది. ఈ విరాళాన్ని బ్యాంకు మేనేజర్ ఉదయ్ తన సిబ్బందితో కలిసి ఆలయ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *