JEE Main Results Released

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

సత్తాచాటిన తెలుగు విద్యార్థులు..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తోన్న జేఈఈ (మెయిన్) ఫలితాలు ఫిబ్రవరి 11న విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలో విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్-1 పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో పాటు క్యాప్చా కోడ్ వివరాలు నమోదుచేసి స్కోర్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

image

జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తాచాటారు. జేఈఈ మెయిన్ పరీక్షలకు దేశ వ్యాప్తంగా 13,11,544 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 12,58,136 మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 11న విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌తో రాణించారు. వీరిలో ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ 10వ ర్యాంకులో, తెలంగాణకు చెందిన బాని బ్రత మాజీ 12వ ర్యాంకులో నిలిచారు. జేఈఈ (మెయిన్) పేపర్-2 (బీఆర్క్‌/బి ప్లానింగ్‌) ఫలితాలను తర్వాత ప్రకటించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది.

కాగా, జేఈఈ మెయిన్ సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ ఇఫ్పటికే ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకు జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి విడత పరీక్షలు రాసినవారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొదటి దశ పరీక్షలో సాధించిన స్కోరుతో సంతృప్తి చెందని వారు రెండో విడత పరీక్షలు రాస్తుంటారు. ఈ రెండింటిలో ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని విద్యార్థులకు ర్యాంకులు కేటాయిస్తారు. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.50లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్‌ ద్వారా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

Related Posts
Revanth Reddy : నరేంద్ర మోదీ మంత్రులకు పెద్దన్న లాంటి వారు: రేవంత్ రెడ్డి
Revanth Reddy నరేంద్ర మోదీ మంత్రులకు పెద్దన్న లాంటి వారు రేవంత్ రెడ్డి

Revanth Reddy : నరేంద్ర మోదీ మంత్రులకు పెద్దన్న లాంటి వారు: రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్దన్న లాంటి వారని, అలాంటి Read more

బంగ్లాదేశ్ హిందువులపై దాడులు.. కోల్‌కతా ఆసుపత్రి కీలక నిర్ణయం
Wont treat Bangladeshi pat

కోల్‌కతా: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో హిందూ ఆలయాలపై కొద్దికాలంగా వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా అక్కడ భారత దేశ జెండాను తొక్కుతూ అవమానించారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ Read more

మొదటి రోజు గ్రూప్-1 మెయిన్సు 72.4% హాజరు
72.4 attendance for Group

ఈ రోజు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 72.4% హాజరు నమోదైంది. మొత్తం 31,383 అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హత సాధించినప్పటికీ, నేడు 22,744 మంది మాత్రమే Read more

MMTS: ఎంఎంటీస్ అత్యాచార ఘటన.. నిందితుడి గుర్తింపు
MMTs rape incident.. accused identified

MMTS : హైదరాబాద్‌ ఎంఎంటీఎస్ ట్రెయిన్‌లో అత్యాచారయత్నం కేసును పోలీసులు ఛేదించారు. అమ్మాయిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన Read more