ఉచిత ఇసుకపై జేసీ కీలక వ్యాఖ్యలు

తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇసుకపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర పనిచేేసే వాళ్లే ఇసుక వ్యాపారం చేస్తున్నారన్నారు. తన అనుచరులు ఇరవై ఐదు మంది వరకూ ఇసుక వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారని , ఈ పనులు ఆపాలని, ఎందుకు మీరే సంపాదించుకోవాలా? నేను సంపాదించుకోవద్దా? అని ప్రశ్నించారు.

గతంలో అక్రమ ఇసుక అరికట్టేందుకు ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేదు. నాకోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు. ఇసుక రవాణా చేసి నాకు దూరం కావొద్దంటూ జేసీ సూచించారు. ఇసుక అవసరమైతే మున్సిపాలిటీ ద్వారా రవాణా చేస్తాం అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇసుక ఎట్లా అమ్మాలో నాకు తెలుసు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ఓనర్లను వదిలిపెట్టను. మీరేనా డబ్బులు సంపాదించుకునేది మిగతావారు లేరా? అంటూ కొందరు టిప్పర్ ఓనర్లపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.