‘దేవర’లో జాన్వీ నెగటీవ్ రోల్..?

ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ఎన్టీఆర్ 30 వ మూవీ దేవర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల – ఎన్టీఆర్ కలయికలో మూవీ రాబోతుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదే క్రమంలో సినిమా తాలూకా అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నారు.

తాజాగా హీరోయిన్ జాన్వీ రోల్ కు సంబదించిన ఓ వార్త వైరల్ గా మారింది. ఈ మూవీ లో జాన్వీ నెగటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఓ సన్నివేశంలో ఆమె ఇచ్చే ట్విస్ట్ థ్రిల్లింగ్గా ఉంటుందట. మరి ఆ ట్విస్ట్ ఎలా ఉందొ చూడాలంటే సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్, టామ్ చాకో, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.