జగన్‌..మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి?: షర్మిల

Jagan..Why declare solidarity with your dharna?: Sharmila

అమరావతి: జనసేన అధినేత వైఎస్‌ జగన్‌ పై ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ప్రశ్నించారు. ఆమె ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ”పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా? 5 ఏళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులు, ప్రత్యేక హోదాను వారికి తాకట్టు పెట్టినందుకా?

మణిపుర్ ఘటనపై ఇన్నాళ్లు నోరెత్తని మీకు ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకురావడం విడ్డూరం. విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో భాజపాకే మద్దతు ఇచ్చారు కదా? వైఎస్‌ఆర్‌ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకే జై కొట్టారు కదా? మణిపుర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి సంఘీభావం వచ్చిందా? మీ నిరసనలో నిజం లేదని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. అందులో జగన్‌ స్వలాభం తప్పా… రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలపలేదు. సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు?” అని షర్మిల విమర్శించారు.