Jagan visit to Kadapa district today

నేడు కడప జిల్లాలో జగన్‌ పర్యటన

అమరావతి: నేడు కడప జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు ఆయన నాలుగు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకోనున్నారు. తొలుత ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళి అర్పిస్తారు. ఆ తర్వాత ప్రేయర్ హాల్ లో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం కడప నియోజకవర్గ నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు పులివెందులకు బయల్దేరుతారు. రాత్రికి పులివెందులలోని నివాసంలో బస చేస్తారు.

Advertisements

రేపు జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొననున్నారు. 26వ తేదీ పులివెందులలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. 27వ తేదీ ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్ లో జరిగే వివాహానికి హాజరవుతారు. ఆ తర్వాత పులివెందుల నుంచి జగన్ బెంగళూరుకు తిరుగుపయనమవుతారు.

Related Posts
ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పొత్తులో Read more

పెద్దపల్లి శివాలయంలో నాగదేవత విగ్రహం వద్ద నాగుపాము దర్శనం – భక్తుల ఉత్సాహం
ఓదెల శివాలయంలో మహాశివరాత్రి రోజున నాగుపాము దర్శనం

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని, తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలోని ప్రసిద్ధ శివాలయంలో ఒక అపూర్వ సంఘటన చోటు చేసుకుంది. శివాలయ ఆవరణలో ఉన్న నాగదేవత Read more

జనసేన ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ విడుదల
Jana Sena avirbhava sabha Poster Released

అమరావతి: జనసేన ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీలతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. మార్చి 14న పిఠాపురం వేదికగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు Read more

మన్మోహన్ గొప్ప దార్శనికుడు : మాజీ రాష్ట్రపతి
Ram Nath Kovind mourns the death of Manmohan Singh

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతికి తీవ్ర సంతాపం తెలియజేశారు. మన్మోహన్‌ సింగ్‌ భారత ఆర్థిక వ్యవస్థకు రూపశిల్పి Read more

×