ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేస్తున్నాడా..? క్లారిటీ ఇదే

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్..తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారనే వార్త రెండు రోజులుగా మీడియా లో వైరల్ గా మారింది. రీసెంట్ గా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. 175 కు 175 సాదించబోతున్నాం అంటూ పగటికలలు కన్నా జగన్ కు ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. కేవలం 11 సీట్లకే పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసారు. ఈ క్రమంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని.. పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయడం తో పాటు , అదేవిధంగా తన సోదరుడు, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డితో కూడా రాజీనామా చేయిస్తారని ప్రచారం ఊపందుకుంది.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి , కడప ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో జగన్‌ పోటీ చేస్తారని, పులివెందుల స్థానానికి జరిగే ఉప ఎన్నికలో తన తల్లి విజయలక్ష్మి లేదా సతీమణి వైఎస్‌ భారతిలను రంగంలోకి దింపుతారని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం ఊపందుకుంది. అదేసమయంలో భారతికి వైసీపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించి, తాను ఢిల్లీకే పరిమితమయ్యేలా జగన్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు ప్రహకారం కొనసాగుతుంది.

ఈ ప్రచారం చూసి అంత నిజమేనా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ ప్రచారం ఫై వైసీపీ పార్టీ నేత సురేష్ బాబు స్పందించారు. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. జగన్.. కడప ఎంపీగా పోటీ చేస్తారనేది శుద్ధ అబద్ధమన్నారు. సోషల్ మీడియాలో టీడీపీ దుష్ప్రచారం చేయడం, దానిపై సీఎం రేవంత్ స్పందించడం మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమన్నారు. వైస్ కుటుంబంలో చిచ్చుపెట్టేలా రేవంత్ వ్యాఖ్యలున్నాయని, ఆయన ఏపీలో గల్లీగల్లీ తిరుగుతాననడం హాస్యాస్పదమన్నారు.