పులివెందులలో మాజీ సీఎం జగన్ ప్రజాదర్బార్..ఎవ్వరు భయపడొద్దంటూ సూచన

మాజీ సీఎం జగన్‌ పులివెందులలోని తమ పార్టీ కార్యాలయంలో రెండవ రోజు ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ క్రమంలో జగన్ ఉదయం నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వినతులను స్వీకరించారు. ఉదయం నుంచే నుంచే కార్యాలయం వద్దకు జగన్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పులివెందుల సందడిగా మారింది. తన క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న జగన్ కార్యకర్తలతో, నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

టీడీపీ నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలామంది కార్యకర్తలు జగన్ దృష్టికి తెచ్చారు. నియోజకవర్గాల వారీగా ద్వితీయ శ్రేణి నాయకులు జగన్‌తో భేటీ అయ్యారు.రాజ‌కీయ ప‌రిణామాల‌పై చ‌ర్చ‌..మొదటగా పులివెందుల కు చెందిన నేతలతో వైయస్ జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నాయకులను జగన్ పేరుపేరునా పలకరించారు. ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో చేపట్టిన నిర్మాణ పనుల పెండింగ్‌ బిల్లుల విషయాన్ని పలువురు జగన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలు‌స్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు నిర్మాణాలకు చేసిన పనులుకు ఇంకా బిల్లులు రాలేదని విన్నవించారు. అక్కడకు జనాలు భారీ సంఖ్యలో రావడంతో గంటలసేపు క్యూలో నిలబడలేని వాళ్లు మాజీ సీఎంను కలవకుండానే వెళ్లిపోయారు. పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని వైసీపీ అధినేత జగన్ తనను కలిసిన నేతలకు సూచించారు. తాను ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా కల్పించారు.