జులై 15 నుండి జగన్ ‘ప్రజాదర్బార్’?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ‘ప్రజా దర్బార్ ‘ అనే కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గాను తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహిస్తారని అంటున్నారు. ఇందుకోసం అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

జగన్ ప్రజా దర్బార్ అనగానే చాలామంది అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. గడిచిన ఐదేళ్లలో సీఎం గా ఈరోజు నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకోలేదని , కనీసం ఎమ్మెల్యేల తో మాట్లాడి నియోజకవర్గ సమస్యలు కానీ , అభివృద్ధి వంటి అంశాలు మాట్లాడలేదని..ఇప్పుడు అధికారం పోయేసరికి ప్రజలు , ప్రజల సమస్యలు గుర్తుస్తొన్నాయి అంటున్నారు. ప్రస్తుతం ప్రజల సమస్యలన్నీ వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడినవే..వాటి గురించే జగన్ తో మాట్లాడాలి..మాట్లాడితే అని పలువురు అంటున్నారు.