శిశుపాలుడి వంద తప్పులు పూర్తయ్యాయిః రఘురామకృష్ణరాజు

జగన్ చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావన్న రఘురామరాజు

MP Raghurama krishna Raju
MP Raghurama krishna Raju

అమరావతిః సిఎం హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేస్తే కనుక ఏపీ సిఎం జగన్‌ కి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం హేమంత్ సోరెన్ చేసింది కనుక తప్పే అయితే, అంతకుమించిన అవినీతి, అక్రమాలకు పాల్పడిన జగన్‌ కూడా తప్పించుకోలేరని అన్నారు. తన సొంత కంపెనీ అయిన సరస్వతీ పవర్ కంపెనీకి సీఎంగా జగన్ అనుమతులు ఇచ్చారని, సాక్షి దినపత్రికకు ఈ మూడున్నరేళ్లలో రూ. 200 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారని రఘురామ ఆరోపించారు.

బిజెపి కార్యదర్శి సత్యకుమార్ గతంలో మాట్లాడుతూ.. కేంద్రంలోని శ్రీకృష్ణుడు.. శిశుపాలుడి వంద తప్పుల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారని గుర్తు చేసిన రఘురామరాజు.. శిశుపాలుడికి ఇక శిరచ్ఛేదం తప్పకపోవచ్చని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల తీరు ఇలానే కొనసాగితే రాష్ట్రపతి పాలన తప్పకపోవచ్చని అన్నారు. కుప్పంలో ప్రజాచైతన్యాన్ని చూసిన తర్వాత కూడా పోలీసులు తన చేతిలో ఉన్నారని, కేసులు పెడతానంటే వ్యవస్థలు చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/