Jack Movie : జాక్ మూవీ రివ్యూ

Jack Movie : జాక్ మూవీ రివ్యూ

టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ  నటించిన ‘జాక్’ సినిమా ఈ రోజు విడుదల అయ్యింది. .ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో హిట్ ట్రాక్‌లో ఉన్నాడు సిద్దు, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తన ఎస్‌వీసీసీ బ్యానర్‌పై నిర్మించారు.ఇప్ప‌టికే ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంది.టెర్రరిస్ట్ కాన్సెప్ట్‌ను ఈ కథలోకి ఎలా జొప్పించారు? ఆ ట్రాక్‌తో ఉన్న లింక్ ఏంటన్నది సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. ఇక వైష్ణవి చైతన్య పాత్రకి చాలా ప్రాధాన్యత ఉందన్నట్టుగా కనిపిస్తోంది.నరేష్ కామెడీ, సిద్దు టైమింగ్, శ్యామ్ సీఎస్ ఆర్ఆర్, అచ్చు రాజమణి పాటలు సినిమాకు ప్లస్ అయ్యేలా ఉన్నాయి. ఇక చాలా రోజుల తరువాత ప్రకాష్ రాజ్‌కు మంచి పాత్ర దక్కినట్టుగా అనిపిస్తుంది. మరి ఈ జాక్ చిత్రం అయితే న్యూ ఏజ్ కంటెంట్, మేకింగ్‌లానే కనిపిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సారి ఎక్కువగా హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను నమ్ముకున్నాడని తెలుస్తోంది.ఈ మూవీ ఆడియన్స్‌ను ఆకట్టుకుందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

Advertisements

కథ

సిద్ధూ జొన్నలగడ్డ ( పాబ్లో నెరేడా అలియాస్ జాక్ )కు చిన్నప్పటి నుంచి రా ఏజెంట్ అయ్యి దేశాన్ని కాపాడాలని కలలు కంటుంటాడు. అందుకే ఇంటర్వ్యూకు కూడా వెళ్తాడు. కానీ అక్కడ్నుంచి రిజల్ట్ రాకముందే దేశం కోసం రంగంలోకి దిగిపోతాడు. అయితే తన కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోడానికి ఓ డిటెక్టివ్ ఏజెన్సీని అప్రోచ్ అవుతాడు జాక్ తండ్రి (నరేష్). అలా భానుమతి (వైష్ణవి చైతన్య) జాక్ జీవితంలోకి వస్తుంది. అప్పట్నుంచి జాక్ ప్రతీ మూమెంట్ ని ఫాలో అవుతుంటుంది భాను. ఈ సమయంలోనే ఇండియాపై టెర్రర్ అటాక్స్ చేయడానికి నుజీఫర్ రెహమాన్ (రాహుల్ దేవ్) ప్లాన్ చేస్తుంటాడు. తన దగ్గర్నుంచి నలుగురు టెర్రరిస్టులను ఇండియాకు పంపిస్తాడు. మరోవైపు ఆ టెర్రరిస్టులను పట్టుకోడానికి రా ఆఫీసర్ మనోజ్ (ప్రకాశ్ రాజ్) రంగంలోకి దిగుతాడు. కానీ జాక్ రావడంతో వాళ్ల ప్లాన్ అంతా పాడవుతుంది. అక్కడ్నుంచి కథ ఏం జరిగింది?అన్నది స్క్రీన్ మీదే చూడాలి.

 Jack Movie : జాక్ మూవీ రివ్యూ

విశ్లేషణ

క్యారెక్టరైజేషన్‌తో ఆడే సినిమాలు కొన్ని మాత్రమే ఉంటాయి.డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు ఇలాంటివే. ఇందులో కథ ఉన్నా లేకపోయినా కేవలం సిద్దూ లాంగ్వేజ్‌కు పడిపోయారు ఆడియన్స్. అందుకే అవి అంత పెద్ద హిట్ అయ్యాయి. కానీ అన్ని సినిమాలు అలా ఆడతాయ్ అనుకుంటే పొరపాటే. అందులోనూ స్పై బ్యాక్‌డ్రాప్ సినిమా అంటే స్క్రీన్ ప్లే పకడ్బందీగా ఉండాలి. ఓ టెర్రరిజం గ్రూప్ ఇండియాపై అటాక్స్ జరపడం,రా ఏజెంట్స్ వాళ్ళను అడ్డుకోవడం ప్రతీ స్పై థ్రిల్లర్‌లోనూ కామన్ కథ ఇదే కానీ దాన్నెలా తెరకెక్కించామనేదే కథా స్క్రీన్ ప్లే. అందులో జాక్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడేమో అనిపించింది. బేసిక్ కథ రాసుకున్న బొమ్మరిల్లు భాస్కర్ అంతకంటే బేసిక్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను తీసాడు.మినిమమ్ లాజిక్ లేని సన్నివేశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి.కమర్షియల్ రూట్‌లోకి వచ్చాననుకున్నాడు కానీ రొటీన్ సినిమా తీసాడు బొమ్మరిల్లు భాస్కర్. ఎంత డైజెస్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలాంటి స్క్రీన్ ప్లేతో జాక్ సినిమాను చూడలేం. అయినా కూడా అక్కడక్కడా తన ఎనర్జీతో సినిమాను కాపాడటానికి చాలా ట్రై చేసాడు సిద్ధూ.

Read Also: Tollywood: శ్రీవారి సన్నిధిలో అర్జున్‌ సన్ ఆఫ్ వైజయంతి మూవీ టీమ్

Related Posts
నేను సింగిల్ అని చెప్పానా అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది
keerthi suresh

ఇటీవల హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గురించి అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె ఓ కమెడియన్‌ను వివాహం చేసుకుందని, లేదా ఒక ప్రముఖ నిర్మాతతో పెళ్లి Read more

‘1000 బేబీస్’ (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ
poster of 1000 babies 1729251280

'1000 బేబీస్' ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించిన వెబ్ సిరీస్ అనేక ఆసక్తి రేకెత్తిస్తున్న అంశాలతో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలలో ప్రాధాన్యత పొందింది నజీమ్ కోయ దర్శకత్వంలో రూపొందిన Read more

లైలా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి
లైలా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి

టాలీవుడ్ యంగ్ హీరో విష్వక్సేన్ ప్రముఖ ద‌ర్శ‌కుడు రామ్‌నారాయ‌ణ్ కాంబినేష‌న్‌లో వస్తున్న తాజా చిత్రం ‘లైలా’ ఈ సినిమాలో విష్వక్ తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించ‌నున్నారు. ఈ Read more

అల్లు అర్జున్ దాడిలో సంబంధం లేదన్న కాంగ్రెస్
అల్లు అర్జున్ దాడిలో సంబంధం లేదన్న కాంగ్రెస్

హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ నివాసంలో జరిగిన విధ్వంసంతో సంబంధం లేదన్న కాంగ్రెస్ ఈ ఆదివారం సాయంత్రం జరిగిన దాడిలో, ప్రధాన నిందితుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×