దొండకాయను ప్రతిరోజూ ఒక కప్పు మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పుష్కల పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కూరగాయలో ఉండే విటమిన్లు, ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రత్యేకించి, ఆరోగ్య సమస్యల నివారణలో దొండకాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. డయాబెటిస్ ఉన్నవారికి దొండకాయ చాలా లాభదాయకంగా ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు సమతుల్యంగా ఉంటాయి. మూత్రాశయ వ్యాధులు, కిడ్నీల్లో రాళ్ల సమస్యల నివారణకు దొండకాయను ఆహారంలో చేర్చడం ఉత్తమమైన మార్గం అని వైద్యులు సూచిస్తున్నారు.
చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా దొండకాయ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో ఉండే నీరు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి తేమను అందించి కాంతివంతంగా ఉంచుతాయి. దగ్గు, జలుబు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గించడంలో దొండకాయ సహజ ఔషధంగా పనిచేస్తుంది. అలాగే దొండకాయలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. క్రమం తప్పకుండా దొండకాయ తీసుకుంటే జీర్ణ సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. ఓవరాల్ గా దొండకాయ ఆరోగ్యానికి ప్రకృతి అందించిన అమూల్యమైన కూరగాయ. రోజూ తక్కువ మోతాదులో దొండకాయ తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంతో పాటు పలు ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.