medaram

మినీ మేడారం జాతరకు వేళాయే..

ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళా అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతరకు సమయం ఆసన్నమైంది. మహాజాతర ముగిసిన ఏడాదికి అదే మాదిరిగా మినీ మేడారం జాతర జరుగుతున్న సంగతి తెలిసిందే. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఈ నెల 12 నుంచి మినీ మేడారం జాతర ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు 4 రోజుల పాటు మినీ మేడార జాతర జరగనుంది. బుధవారం మినీ మేడారం జాతరకు అంకురార్పణ జరిగింది. అంటే జాతర ప్రారంభానికి సరిగ్గా వారం రోజుల ముందు గుడి మెలిగె, మండ మెలిగె పండుగను నిర్వహిస్తుంటారు. ఈ నెల 12న జాతర ప్రారంభం కానుండటంతో పూజారులు బుధవారం గుడి మెలిగె పండుగకు శ్రీకారం చుట్టారు.

బుధవారం మేడారంలో గల సమక్క ఆలయంలో సిద్ధబోయిన వంశస్థులు, కన్నెపల్లలోని సారలమ్మ ఆలయంలో కాక వంశీయులు గుడి మెలిగె పండుగను నిర్వహించారు. ఈ గుడి మెలిగె పండుగలో భాగంగా పూజారులు గుడిని శుద్ధి చేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిసి డోలు వాయిద్యాలతో అటవీప్రాంతంలోకి వెళ్లి గుట్టగడ్డిని తీసుకువచ్చారు. గడ్డికి పసుపు, కుంకుమలతో పూజలు చేసిన అనంతరం పూజామందిరాన్ని అలంకరించారు. ఈ మండమెలిగె, గుడి మెలిగె పండుగతో మినీ మేడారం జాతర ప్రారంభమైనట్లేనని పూజారులు వెల్లడించారు. ఇప్పటి నుంచి మినీ జాతర ముగిసే వరకు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులను కూడా మోహరించనున్నారు. మినీ మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం మౌలిక వసతులు, తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు, రవాణా, భద్రతా ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది.

Related Posts
మహిళపై చిరుత దాడి
Leopard attack on woman

ఆదిలాబాద్‌ జిల్లాలో చిరుతపులి భయం వీడడం లేదు. తాజాగా బజార్హాత్నూర్ మండలంలో చిరుతపులి దాడి జరిగింది. ఓ మహిళపై చిరుత దాడి చేయడంతో ఆమె ముఖానికి తీవ్ర Read more

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం తాజాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు ముఖ్యమైన సంక్షేమ పథకాలను ప్రారంభించింది. ఇవి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త Read more

రెన్యూవల్ కోసం పాస్‌పోర్టు కార్యాలయానికి వచ్చిన కెసిఆర్
బీఆర్ఎస్ కార్యాలయానికి కేసీఆర్ రాక – రాజకీయ ఉత్కంఠ

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, కెసిఆర్ సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. బుధవారం ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి తన సతీమణితో కలిసి కేసీఆర్ పాస్‌పోర్టు ఆఫీసుకు Read more

మొదటి రోజు గ్రూప్-1 మెయిన్సు 72.4% హాజరు
72.4 attendance for Group

ఈ రోజు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 72.4% హాజరు నమోదైంది. మొత్తం 31,383 అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హత సాధించినప్పటికీ, నేడు 22,744 మంది మాత్రమే Read more