It's endgame for Naxalism in India, says Amit Shah, meets former insurgents

నక్సలిజాన్ని రూపుమాపుతాం: అమిత్ షా

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన దాదాపు 30 మంది మాజీ నక్సల్స్‌తో చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో అమిత్ షా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలో 31 మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని అన్నారు.

Advertisements

నక్సల్ రహిత.. డ్రగ్ రహిత ఇండియా కలను సాకారం చేయడంలో ఛత్తీస్‌గఢ్ పోలీసుల కృషిపై హోంమంత్రి ప్రశ్నంసలు కురిపించారు. వారి సహకారాన్ని సువర్ణాక్షరాలతో లిఖించాలని కొనియాడారు. మిగిలిన నక్సలైట్లు కూడా హింసా మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. మీరు లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలవాలని చేసిన ప్రయత్నాలు ఫలించినందుకు తాను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నానని అమిత్ షా పేర్కొన్నారు.

గత ఏడాది కాలంలో 287 మంది నక్సల్స్‌ను భద్రతా దళాలు హతమార్చాయని, 1000 మందిని అరెస్ట్ చేయగా, 837 మంది లొంగిపోయారని అమిత్ షా తెలిపారు. నక్సలిజంపై మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరి కారణంగా గత నాలుగు దశాబ్దాల్లో తొలిసారి పౌరులు, భద్రతా బలగాల మరణాల సంఖ్య 100 లోపునకు పడిపోయిందని వివరించారు.

Related Posts
Telangana: సుపారీ తో ప్రియురాలి భర్త ను హతమార్చిన ప్రియుడు
Mumbai: పది లక్షలు చెల్లించలేదని చికిత్స చేయకపోవడంతో గర్భిణీ మృతి

మహబూబాబాద్‌లో ఇటీవల జరిగిన పార్థసారథి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు, అడ్డుగా మారిన భర్తను హత్య చేయించడానికి ప్రియుడు తన ప్రియురాలితో కలిసి Read more

బాలీవుడ్‌ న‌టుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు
actor govind

బాలీవుడ్‌ నటుడు, శివసేన లీడర్‌ గోవిందా ఇంట్లో గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో గోవిందాకు తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ తెల్ల‌వారుజామున 4.45 గంట‌ల Read more

దక్షిణ కొరియా అధ్యక్షుడు అరెస్ట్
South Korean President Yoon Suk Yeol arrested

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను అధికారులు బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. దేశంలో అనూహ్యంగా ఎమర్జెన్సీ ప్రకటించిన ఆయన చిక్కులు కొనితెచ్చుకున్నారు. ఇప్పటికే అభిశంసనకు Read more

ఎల్ కె అద్వానీకి అస్వస్థత
LK Advani Indian politician BJP leader India 2015

భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్ కె అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో శనివారం ఉదయం అద్వానీని ఆయన కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి Read more

Advertisements
×