It's endgame for Naxalism in India, says Amit Shah, meets former insurgents

నక్సలిజాన్ని రూపుమాపుతాం: అమిత్ షా

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన దాదాపు 30 మంది మాజీ నక్సల్స్‌తో చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో అమిత్ షా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలో 31 మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని అన్నారు.

నక్సల్ రహిత.. డ్రగ్ రహిత ఇండియా కలను సాకారం చేయడంలో ఛత్తీస్‌గఢ్ పోలీసుల కృషిపై హోంమంత్రి ప్రశ్నంసలు కురిపించారు. వారి సహకారాన్ని సువర్ణాక్షరాలతో లిఖించాలని కొనియాడారు. మిగిలిన నక్సలైట్లు కూడా హింసా మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. మీరు లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలవాలని చేసిన ప్రయత్నాలు ఫలించినందుకు తాను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నానని అమిత్ షా పేర్కొన్నారు.

గత ఏడాది కాలంలో 287 మంది నక్సల్స్‌ను భద్రతా దళాలు హతమార్చాయని, 1000 మందిని అరెస్ట్ చేయగా, 837 మంది లొంగిపోయారని అమిత్ షా తెలిపారు. నక్సలిజంపై మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరి కారణంగా గత నాలుగు దశాబ్దాల్లో తొలిసారి పౌరులు, భద్రతా బలగాల మరణాల సంఖ్య 100 లోపునకు పడిపోయిందని వివరించారు.

Related Posts
పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం
jagan metting

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, Read more

అగస్టా వెస్ట్‌లాండ్‌ కుంభకోణం: క్రిస్టియన్‌ మైఖేల్‌కు ఊరట
అగస్టా వెస్ట్‌లాండ్‌ కుంభకోణం: క్రిస్టియన్‌ మైఖేల్‌కు ఊరట

అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ కుంభకోణంలో ప్రధాన మధ్యవర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్ పౌరుడు క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 3600 కోట్ల Read more

నేడు ఫ్రాన్స్ పర్యటనకు మోదీ
నేడు ఫ్రాన్స్ పర్యటనకు మోదీ

నేడు ఫ్రాన్స్ పర్యటనకు మోదీ.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఫ్రాన్స్‌కు రెండు రోజుల అధికారిక పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో, ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో Read more

రైలు హైజాక్ ఆపరేషన్ విజయవంతం
రైలు హైజాక్ ఆపరేషన్ విజయవంతం

పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించిన రైలు హైజాక్ ఘటనకు ముగింపు పలికేలా ఆర్మీ విజయవంతమైన ఆపరేషన్‌ను నిర్వహించింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు హైజాక్ చేసిన జాఫర్ Read more