ప్రభుత్వానికి కేటీఆర్ డెడ్ లైన్

ktr comments on congress govt

ఆగస్టు 2లోగా కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి కేటీఆర్ డెడ్ లైన్ విధించారు. లేకపోతే కెసిఆర్ అధ్వర్యంలో తామే 50 వేల మందితో ఆన్ చేస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) సందర్శన రెండో రోజు కొనసాగుతున్నది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) నేతృత్వంలో హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన ప్రజా ప్రతినిధుల బృందం.. గురువారం సాయంత్రం కరీంనగర్‌లో లోయర్‌ మానేరు రిజర్వాయర్‌ను పరిశీలించిన విషయం తెలిసిందే. ఈరోజు పార్టీ ప్రతినిధులతో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కల్పతరువు లాంటి ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. గోదావరిలో నీరున్నా రైతులకు నీళ్లిచ్చే మనసు ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.

ఇదే సందర్బంగా గోదావరిఖనిలో సింగరేణి క్వాటర్ల కూల్చివేత బాధితులు కేటీఆర్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. గోదావరిఖని లక్ష్మినగర్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ డెవలప్‌మెంట్‌ అంటూ సింగరేణి క్వాటర్లు కూల్చివేశారని మెరపెట్టుకున్నారు. 82 క్వాటర్లకు కరెంటు, నీళ్లు కట్‌ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌ మక్కన్‌సింగ్‌ అరాచక పాలన చేస్తున్నారని తెలిపారు.