IT searches in Hyderabad again

మరో సారి హైదరాబాద్‌లో ఐటీ సోదాలు..

హైదరాబాద్ : ఐటీ అధికారుల సోదాలు హైదరాబాద్ లో మరో సారి కలకలం రేపుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలే లక్ష్యంగా మరో సారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలో ఏకకాలంలో 30 ప్రదేశాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. గురువారం వేకువజాము నుంచి ఈ ఐటీ సోదాలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, జూబ్లీహిల్స్, రాయదుర్గం, చైతన్యపురి, మలక్ పేట, కొల్లూరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ తనిఖీలు కొనసాగిస్తున్నారు. అన్విత బిల్డర్స్, ప్రాపర్టీస్ కార్యాలయాలు, యాజమాన్యాల ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి.

చైతన్యపురిలోని గూగీ ప్రాపర్టీస్ కార్యాలయంలోనూ సోదాలు చేపట్టారు. అన్విత బిల్డర్స్ అధినేత బొప్పరాజు శ్రీనివాస అచ్యుతరావు నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. మలక్‌పేట నియోజకవర్గ కాంగ్రెస్ నేత షేక్ అక్బర్ నివాసంలో, ఆయనకు చెందిన గూగి ప్రాపర్టీస్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఐటీ అధికారులు 40 బృందాలుగా రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించి పలు దస్త్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో గత నెల 23వ తేదీన విస్తృతంగా ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Related Posts
నడిరోడ్డు పై కాంగ్రెస్ నాయకుడు బర్త్ డే వేడుకలు..ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు
Congress leaders roadside

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో సోమవారం రాత్రి కాంగ్రెస్ నాయకుడు చిలుకూరి బాలూ పుట్టినరోజు వేడుకలు జరపడం తో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ వేడుకలు రాజీవ్ చౌక్ Read more

ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే కూల్చివేయాల్సిందే: సుప్రీంకోర్టు
Amaravati capital case postponed to December says supreme court jpg

Supreme Court న్యూఢిల్లీ: ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేస్తూ Read more

నెల రోజులు మాంసం దుకాణాలు బంద్.. ఎక్కడ..ఎందుకు ?
Meat Shops

బెంగళూరులో నిర్వహించనున్న ఏరో ఇండియా 15వ ఎడిషన్ షో కారణంగా ప్రత్యేక ఆదేశాలు జారీచేశారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు యెలహంకలో ఈ ప్రతిష్ఠాత్మక ఎయిర్ Read more

తెలంగాణ లో పడిపోయిన ఉష్ణోగ్రతలు
weather update heavy cold waves in Telangana

తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. కొమురం భీమ్ జిల్లా సిర్పూర్, గిన్నెదారిలో 6.5°C తో రాష్ట్రంలో అత్యల్ప Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *