మనదాకా వస్తే కానీ అర్థం కాదు:కరీనా కపూర్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దుండగుల దాడి సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ దాడిలో సైఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి.పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడిన దుండగులు అతనిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్ కు ఆరు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ దాడి జరిగిన సమయంలో ఇంట్లో సైఫ్ అలీఖాన్ ఒక్కడే ఉన్నాడని తెలుస్తోంది. మరోవైపు తన భర్తపై జరిగిన దాడిపై నటి కరీనా కపూర్ స్పందించింది.

మనదాకా వస్తే కానీ అర్థం కాదు:కరీనా కపూర్.జీవితంలో మనం అనుకునే సిద్దాంతాలు,ఊహలు ఏవి వాస్తవాలు కావు.ఇతరులకంటే మనమే గొప్పవాళ్ళం తెలివైనవాళ్ళం అనుకుంటాం. సందర్భం వచ్చినపుడు జీవితం మన మెడలు వంచి పాఠాలు నేర్పుతుంది. అని బాలీవుడ్ నటి కరీనా కపూర్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో హార్ట్ ఈమోజీ తో తాజాగా పోస్ట్ చేసారు. భర్త సైఫ్ అలీఖాన్ ఫై ఇటీవల ఓ ఆగంతకుడు కత్తితో జరిపిన ప్రాణాంతక దాడి నేపథ్యంలో ఆమె పెట్టిన ఈ పోస్టులో ఆసక్తికర వాఖ్యలు చేశారు.”ఈ పెళ్లిళ్లు,విడాకులు,ఆందోళనలు,పిల్లలు పుట్టడం,ఆత్మీయుల మరణాలు,పిల్లల పెంపకం ఇవన్నీ మనదాకా వస్తేనే అర్థమవుతాయి”అన్నారు. గత నెల 16 న సైఫ్ పైదాడి జరిగిన రోజున కరీనా “మా కుటుంబానికి ఎంతో సవాలుతో కూడిన రోజు“అని సామజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించారు. “ఏమి జరిగిందో మాకే ఇప్పటికి పూర్తిగా అర్థం కావడం లేదు. ఈ కష్ట సమయంలో కనికరం లేని ఊహాగానాలు,కథనాలు కు దూరంగా ఉండాలని మీడియా కు, ఫొటోగ్రాఫర్లకు సవినయంగా మనవి చేస్తున్న” మాపై చూపిస్తున్న అభిమానాన్ని గౌరవిస్తున్నప్పటికీ ఇటువంటి చర్యలు మా భద్రత ను మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది.ఈ ఘటనను తేరుకునేందుకు వీలుగా మా కుటుంబానికి కొంత వ్యక్తిగత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్న అని ఆమె ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చారు.