It is sad that devotees lost their lives.. Jagan

భక్తులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం: జగన్‌

అమరావతి: తిరుమల వేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

image
image

గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. వెంటనే అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

నిన్న తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీలో ఐదుగురు మహిళలుతో పాటు ఓ వ్యక్తి మృతి చెందారు. వారిలో విశాఖకు చెందిన జి. రజనీ (47) లావణ్య (40), శాంతి (34), తమిళనాడుకు చెందిన మెట్టు సేలం మల్లికా, కర్ణాటకకు చెందిన నిర్మల (50), నర్సీపట్నంకు చెందిన బొద్దేటి నాయుడుబాబు చనిపోయారు. మరికొందరు తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Related Posts
భైరవ అష్టమి మహోత్సవం..2024 రకాల మిఠాయిలు..84,000 చదరపు అడుగుల రంగోలీతో ప్రపంచ రికార్డు
Bhairava Ashtami Mahotsavam.2024 types of sweets.world record with 84000 square feet Rangoli

హైదరాబాద్‌: అఖిల భారతీయ బతుక భైరవ భక్త మండలి మరియు పార్శ్వ పద్మావతి శక్తి పీఠం, కృష్ణగిరి, తమిళనాడు పీఠాధిపతి డా. వసంత్ విజయ్ జీ మహారాజ్ Read more

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సర్వం సిద్ధం..
222

హైదరాబాద్‌: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు రేపు (మంగళవారం)జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల Read more

పాతపట్నంలో ఆవుపై దాడి చేసిన పెద్దపులి
tiger attacked a cow

శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల పెద్దపులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. పాతపట్నం మండలంలోని తీమర గ్రామ సమీపంలో ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసింది. ఆవును Read more

రాజస్థాన్ రాయల్స్ లోకి క్రికెటర్ మాజీ కోచ్ రీ ఎంట్రీ
రాజస్థాన్ రాయల్స్ లోకి క్రికెటర్

భారత మాజీ క్రికెటర్ సాయిరాజ్ బహుతులే రాజస్థాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా తిరిగి చేరనున్నారు.2018 నుండి 2021 వరకు ఈ ఫ్రాంచైజీతో పని చేసిన సాయిరాజ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *