హైదరాబాద్ లో ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఐటీ కంపెనీ..

ప్రస్తుతం ఐటీ గడ్డు కాలం ఎదురుకుంటుంది. కొత్త ప్రాజెక్ట్ లు రాకపోవడం..ఉన్న ప్రాజెక్ట్ లకు డబ్బులు రాకపోవడం తో చాల ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు తీసివేస్తున్నారు. ఈ క్రమంలో హైదరబాద్‌ లోని బ్రేన్​అనే ఐటీ కంపెనీ దాదాపు 1500 మంది ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఇలాంటి సమాచారం ఇవ్వకుండా వారిని ఉద్యోగం నుండి తొలగించింది. వివిధ రకాల బిజినెస్‌ కారణాలు చెబుతూ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వారికి మెయిల్స్‌ ఇచ్చింది. మూడు నెలల జీతం ఇవ్వకుండానే లేఆఫ్స్​ ప్రకటించడం ఫై ఉద్యోగస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కంపెనీకి బెంగళూరు, సింగపూర్​లో కూడా బ్రాంచులు ఉన్నాయి. హైదరాబాద్ (Hyderabad)​ బ్రాంచ్​లో దాదాపు 3వేల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. బ్రేన్​కంపెనీ మూడు నెలలుగా జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. మార్చి నెలలో ఒకటో తేదీన పడాల్సిన జీతాలను 18న చెల్లించారని తెలిపారు. కొందరికి ఏప్రిల్​నెల మధ్యలో వేశారని తెలిపారు. కొందరికి ఏప్రిల్, మే నెల చివరి రోజుల్లో జీతంలో పది శాతం మాత్రమే ఇచ్చారని తెలిపారు. మే నెల నుంచి జీతాలు ఇవ్వకుండా తేదీలు మార్చుతూ వస్తున్నారని బాధితులు వాపోతున్నారు. కేవలం ఇదొక సంస్థే కాదు పలు సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. వారు కూడా తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధం గా ఉన్నాయి.