Isuzu Motors India has expanded its service footprint in Telangana

తెలంగాణలో ఇసుజు మోటార్స్ ఇండియా విస్తరణ

హైదరాబాద్‌: ఇసుజు మోటార్స్ లిమిటెడ్, జపాన్ యొక్క అనుబంధ సంస్థ ఇసుజు మోటార్స్ ఇండియా తెలంగాణలో తన సర్వీస్ ఫుట్‎ప్రింట్ ను విస్తరించింది. మరియు ఈరోజు ఖమ్మంలో కొత్త ఇసుజు అధీకృత సేవా కేంద్రము (ఏఎస్‎సి) ప్రారంభించింది. తన సేవలు మరియు వినియోగదారు అనుభవాన్ని విస్తరిచడముపై బలమైన దృష్టితో, ఇసుజు మోటార్స్ ఇండియా ఖమ్మంలో బియాండ్ ఆటో కేర్ ను నియమించింది. ఇది తెలంగాణలో ఇసుజు యొక్క 3వ టచ్‎పాయింట్. ఈ సదుపాయము ఎస్‎వి పవర్ ప్లాజా, ఖమ్మంలో ఉంది మరియు ఈ ప్రాంతములో ఇసుజు వినియోగదారులకు అంతరాయంలేని సహకారాన్ని అందించుటకు ఇక్కడ ఆధునిక పనిముట్లు, అసలైన విడిభాగాలు, ల్యూబ్స్ మరియు సుశిక్షితులైన సిబ్బంది ఉంటారు.

ఏఎస్‎సి సదుపాయము వినియోగదారుల సమక్షములో ఇసుజు మోటార్స్ ఇండియా మరియు బియాండ్ ఆటో కేర్ నుండి కంపెనీ అధికారులచే ప్రారంభించబడింది. ఈ సందర్భంగా టోరు కిషిమోటో, డెప్యూటి మేనేజింగ్ డైరెక్టర్, ఇసుజు మోటార్స్ ఇండియా మాట్లాడుతూ.. “అంతరాయం లేని సర్వీస్ సహకారాన్ని మరియు వారి మొత్తం ప్రయాణములో మా వినియోగదారులతో అర్థవంతమైన సంబంధాన్ని నిర్ధారించుటకు దేశవ్యాప్తంగా మా నెట్వర్క్ యాక్సెస్ ను విస్తరించాలని మేము కట్టుబడి ఉన్నాము. అసాధారణ వినియోగదారు సంతృప్తి మా సేవా భావజాలానికి కేంద్రకము మరియు మా విశ్వసనీయమైన నెట్వర్క్ భాగస్వాముల మద్ధతుతో యాజమాన్య అనుభవాన్ని పెంచుటకు మేము కట్టుబడి ఉన్నాము. బియాండి ఆటో కేర్ తో మా సహకారము ఈ ప్రాంతములో మేము అందించాలని కోరుకునే అంతరాయములేని మరియు వ్యక్తిగతీకరించబడిన సేవా అనుభవాన్ని మెరుగుపరచుటకు మాకు తోడ్పడుతుందన్నారు.

image

కేతినేని నరసింహారావు, డీలర్ ప్రిన్సిపల్ ఆఫ్ బియాండ్ ఆటోకేర్ మాట్లాడుతూ.. “ఖమ్మంలో ఒక అధీకృత సేవా కేంద్రముగా ఇసుజు మోటార్స్ ఇండియాతో మా భాగస్వామ్యాన్ని ప్రకటించుటకు మేమెంతో సంతోషిస్తున్నాము. అసాధారణ సేవను అందించడము మరియు అత్యధిక స్థాయి వినియోగదారు సంతృప్తిని నిర్ధారించుట మా ప్రాథమిక దృష్టిగా నిలిచింది అన్నారు. ఇక, ఒక అధీకృత ఇసుజు సేవా కేంద్రముగా, బియాండ్ ఆటో కేర్, ఇసుజు వాహనదారులకు అత్యుత్తమ సేవ మరియు సహకారాన్ని అందించుటకు కట్టుబడి ఉంది. నాణ్యమైన సేవ మరియు వినియోగదారు-కేంద్రక కార్యకలాపాల ద్వారా ఖమ్మం మరియు పరిసర ప్రాంతాలలోని ఇసుజు వినియోగదారుల కొరకు యాజమాన్య అనుభవాన్ని పెంచడము దీని లక్ష్యము.

Related Posts
హైదరాబాద్ లో రెండు చోట్ల హాష్ ఆయిల్ సీజ్
Hash oil

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడలో 300 ఎం.ఎల్. హాష్ ఆయిల్‌ను టీఎస్ఎన్ఏబీ అధికారులు సీజ్ చేశారు. బండ్లగూడలో ఓ కిలేడి లేడీ రహస్యంగా హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు Read more

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది భారత పౌరులు మృతి
Fatal road accident in Saudi Arabia.. 9 Indian citizens killed

సౌదీ ఆరేబియా: సౌదీ ఆరేబియా లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది భారత పౌరులు దుర్మరణం పాలయ్యారు. సౌదీ అరేబియా Read more

రేపు సెలవు – తెలంగాణ ప్రభుత్వం ప్రకటన
Holiday tomorrow - Announcement by Telangana Govt

తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పబ్లిక్ హాలిడే ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మరియు బ్యాంకులు Read more

భారతదేశం చేసిన హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష: చరిత్రాత్మక విజయం
hypersonic missile

భారతదేశం తొలి లాంగ్-రేంజ్ హైపర్సోనిక్ క్షిపణి ని విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్ష భారతదేశం యొక్క రక్షణ సామర్థ్యాలను పెంచే దిశగా కీలకమైన అడుగుగా నిలిచింది. ప్రభుత్వ Read more