Israeli Prime Minister Netanyahu reacts to the death of Ratan Tata

రతన్ టాటా మరణంపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణంపై ప్రపంచ దేశాల అధినేతలు సంతాపాలు తెలియజేస్తున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమన్ నెతన్యాహు స్పందించారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య స్నేహ బంధానికి ఛాంపియన్‌గా రతన్ టాటాను ఆయన కొనియాడారు. ఈమేరకు ఎక్స్ వేదికగా సంతాప సందేశాన్ని పంచుకున్నారు. ‘భారత్ గర్వించదగిన కొడుకు’ అని కొనియాడారు. భారత్-ఇజ్రాయెల్ సంబంధాలను పెంపొందించడంలో రతన్ టాటా ముఖ్య పాత్ర పోషించారని అన్నారు.

‘‘ఇజ్రాయెల్‌లోని చాలామంది ప్రజలతో పాటు నేను కూడా రతన్ టాటా మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. రతన్ టాటా భారతదేశం గర్వించదగిన కొడుకు. మన రెండు దేశాల మధ్య స్నేహబంధానికి ఛాంపియన్ అయిన రతన్ టాటాను కోల్పోవడం విచారకరం. దయచేసి రతన్ కుటుంబానికి నా సానుభూతిని తెలియజేయండి’’ అని ఎక్స్ వేదికగా ప్రధాని మోడీని బెంజమన్ నెతన్యాహు కోరారు. కాగా రతన్ టాటా మరణం పట్ల ఇజ్రాయెల్ ప్రధానితో పాటు అనేక మంది ప్రపంచ నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

కాగా, టాటా గ్రూప్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ అయిన రతన్ టాటా అక్టోబర్ 9న కన్నుమూశారు. 86 సంవత్సరాల వయస్సులో చనిపోయారు. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. వ్యాపార, రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Related Posts
తెలంగాణలో ఉనికిని పెంచుకోవాలని బీజేపీ
తెలంగాణలో ఉనికిని పెంచుకోవాలని బీజేపీ

ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినందున భారతీయ జనతా పార్టీ (బిజెపి) తెలంగాణ శాసన మండలిలో తన ఉనికిని పెంచుకోవాలని Read more

ఎన్నికలకు ముందు AAPపై ఒత్తిడి వ్యూహాలు
athishi 1

మంగళవారం తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో గోవింద్‌పురి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్‌ను అడ్డుకుని, దాడి చేసినందుకు అధికార ఆప్‌కు చెందిన ఇద్దరు సభ్యులు అష్మిత్, సాగర్ Read more

క్యూబా లో ఉష్ణమండల తుఫాన్ ఆస్కార్ కారణంగా ఎదురైన కష్టాలు
tropical cyclone three 03a off somalia november 8 2013 54f93a 1024

ఆస్కార్ తుఫాన్ కారణంగా వచ్చిన భారీ వర్షాలు అనేక ప్రాంతాల్లో వరదలకు దారితీసింది. పంటలు, ఇళ్లు చాలా నష్టపోయాయి. రైతులు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో Read more

కుంభమేళా తొక్కిసలాట ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంల దిగ్బ్రాంతి
telugucm

ప్రయాగ్ రాజ్: మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మౌని అమావాస్య సందర్భంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *