Israeli bombs on Gaza. 29 people died

గాజాపై ఇజ్రాయెల్‌ బాంబుల మోత.. 29 మంది మృతి

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రత‌రం అవుతోంది. సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని నుసిరత్‌లో ఓ పాఠశాలపై ఆదివారం ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 19 మంది మృతి చెందారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు పాలస్తీనా వర్గాలు తెలిపాయి.

గత ఏడాది కాలంగా జరుగుతున్న యుద్ధం వల్ల నిరాశ్రయులైన అనేక మంది పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించడం కోసం ఈ పాఠశాలను ఓ శరణార్థి శిబిరంగా మార్చిన‌ట్లు స‌మాచారం. అయితే దానిపైనే ఇజ్రాయెల్ ఇప్పుడు దాడి చేసింది. రెస్క్యూ టీమ్ 19 మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. అలాగే పిల్లలు, మహిళలు సహా 80 మంది గాయపడిన వారిని సెంట్రల్ గాజాలోని ఆసుపత్రులకు తరలించినట్లు పారామెడిక్స్ తెలిపారు.

అక్టోబరు 7, 2023న దక్షిణ ఇజ్రాయెల్‌పై జరిగిన హమాస్ దాడికి ప్ర‌తీకారంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడిలో ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 1,200 మంది చ‌నిపోయారు. సుమారు 250 మంది బందీలు అయ్యారు. ఇజ్రాయెల్ వైమానిక దాడులలో పాలస్తీనియన్ల మరణాల సంఖ్య 42,227కు చేరుకుందని గాజా ఆరోగ్యశాఖ‌ అధికారులు ఆదివారం వెల్ల‌డించారు.

Related Posts
ఏపీ మాజీ గవర్నర్ హరిచందన్ కు అస్వస్థత
Harichandan

ఆంధ్రప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురికావడంతో ఆయనను భువనేశ్వర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పై వైద్యులు Read more

భారతీయులకు జో బైడెన్ శుభవార్త
visa

ట్రంప్ ఎన్నికలో గెలిచి, జనవరిలో కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న తరుణంలో వీసాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆందోనళ చెందే వారికీ జో బైడెన్ Read more

కేటీఆర్‌ లాయర్లను అనుమతించని ఏసీబీ..
ACB officials who did not allow KTR's lawyers

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న ఫార్మూలా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. బంజారాహిల్స్ ఏసిబి వద్ద కేటీఆర్ వాహనాన్ని Read more

కరెంట్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన
electricity bill

తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ ఛార్జీల పెరుగుదలపై చర్చ జరుగుతున్న సమయంలో, డిస్కం (డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) సీఎండీ ముషారఫ్ కరెంట్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. హైటెన్షన్ ఇండస్ట్రియల్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *