హమాస్‌పై విరుచుకుని పడుతున్న ఇజ్రాయెల్: 220 మంది హతం

Israel: హమాస్‌పై విరుచుకుని పడుతున్న ఇజ్రాయెల్: 220 మంది హతం

గాజాపై ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు మంగళవారం భీకర దాడికి దిగాయి. జనవరి19న కాల్పుల విరమణ మొదలైన తరువాత ఇజ్రాయెల్ ఈ స్థాయిలో హమాస్‌పై వైమానిక దాడికి దిగడం ఇదే తొలిసారి. ఈ దాడిలో ఏకంగా 220 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఉత్తర గాజాతో పాటు, గాజా నగరం, డెయిర్ అల్ బలాహ్, ఖాన్ యూనిస్, రఫా, దక్షిణ గాజా తదితర ప్రాంతాలు బాంబు పేళుళ్లతో దద్దరిల్లాయి. హమాస్ ఉగ్రసంస్థకు చెందిన పలు స్థావరాలను టార్గెట్ చేసుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. గాజాకు సమీపంలోని ప్రాంతాల్లో స్కూల్లకు సెలవులను ప్రకటించింది.

Advertisements
హమాస్‌పై విరుచుకుని పడుతున్న ఇజ్రాయెల్: 220 మంది హతం


ఓ ప్రకటన చేసిన ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ
ఇజ్రాయెల్ బందీలను తిరిగి అప్పగించేందుకు హమాస్ పదే పదే నిరాకరిస్తున్న నేపథ్యంలో దాడులకు దిగినట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా అధ్యక్షుడి ప్రతినిధి తోపాటు ఇతర మధ్యవర్తులు చేసిన అనేక ప్రతిపాదనలను తాము తిరస్కరించినట్టు కూడా ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, దాడులు మళ్లీ ప్రారంభం అవడానికి ఇజ్రాయెల్ ప్రధానిదే బాధ్యత అని హమాస్ స్పష్టం చేసింది. నియమాలు ఉల్లంఘించారని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని తలకిందులు చేశారని ఆరోపించింది. ‘‘యుద్ధం మళ్లీ ప్రారంభించడమంటే.. బందీలకు మరణ శిక్ష విధించడమే’’ అని హమాస్ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, రాజకీయ ఉనికికి కాపాడుకునేందుకు యుద్ధాన్ని ఇజ్రాయెల్ ప్రధాని ఓ పావుగా వాడుకుంటున్నారని ఆరోపించింది.
పుతిన్ తో నేడు మాట్లాడనున్న ట్రంప్
కాల్పుల విరమణ ఒప్పందాన్ని మూడు దశల్లో అమలు చేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్, హమాస్ చర్చలు ప్రారంభించాయి. తొలి దశను మరికొంత కాలం పొడిగించాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తుండగా రెండో దశలోనే తమ వద్ద ఉన్న బందీలను విడిచిపెడతామని హమాస్ పట్టుబడుతోంది.

Related Posts
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై వేటు వేసిన కూటమి ప్రభుత్వం
AP Ex CID Chief Sanjay Susp

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. తాజాగా ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా Read more

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
Amaravati capital case postponed to December says supreme court jpg

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఏఎస్పీ మేకల Read more

ఇయర్-ఎండ్ సేల్‌ను ప్రకటించిన రాయల్ఓక్ ఫర్నిచర్
RoyalOak Furniture Announces Year End Sale

భారతదేశంలోని 200+ స్టోర్లలో అంతర్జాతీయ ఉత్పత్తులపై సాటిలేని తగ్గింపును అందించిన భారతదేశంలోని మొట్టమొదటి ఫర్నిచర్ బ్రాండ్ సోఫాలు కేవలం రూ. 21,990 నుండి మరియు బెడ్‌లు రూ. Read more

Market Committee : 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన
markets

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×