ఇరాన్‌ కొత్త అధ్యక్షుడిగా సంస్కరణవాది మసౌద్ పెజెష్కియాన్‌

Iran new president is reformist Masoud Pezeshkian

టెహ్రాన్: ప్రముఖ సంస్కరణవాది, హార్ట్ సర్జన్, సుదీర్ఘకాలం చట్టసభ్యుడిగా పనిచేసిన మసౌద్ పెజెష్కియన్ ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష ఎన్నికల్లో అల్ట్రాకన్జర్వేటివ్ సయాద్ జలీల్‌పై విజయం సాధించారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కుదిపేస్తున్న ఆంక్షలు, ఇటీవల దేశాన్ని కుదిపేసిన హెడ్‌స్కార్ఫ్ చట్టం అమలును సులభతరం చేస్తామన్న హామీలు మసౌద్‌కు విజయం చేకూర్చాయి. లెక్కించిన మొత్తం 3 కోట్ల ఓట్లలో డాక్టర్ పెజెష్కియాన్‌కు అనుకూలంగా 1.6 కోట్లకుపైగా ఓట్లు ( 53.3 శాతం).. జలీలీకి 1.3 కోట్లకుపైగా ఓట్లు ( 44.3 శాతం) ఓట్లు వచ్చాయి. దాంతో పెజెష్కియాన్ ఎన్నికైనట్టు అధికారులు ధ్రువీకరించారు. ఈ మేరకు ఎన్నికల విభాగం అధికార ప్రతినిధి మెహసెన్ ఇస్లామీ ప్రకటన చేశారు.

కాగా, ఇరాన్‌ రాజ్యాంగం ప్రకారం మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు సాధించిన అభ్యర్థినే అధ్యక్షుడిగా నియమిస్తారు. అలా రానప్పుడు అగ్రస్థానంలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల మధ్య వారం రోజుల తర్వాత రన్‌ఆఫ్‌ పోలింగ్‌ నిర్వహించాలి. జూన్ 28న జరిగిన తొలి రౌండ్ ఎన్నికల్లో కేవలం 40 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. దాదాపు 60 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఆ రౌండ్‌లో ఏ అభ్యర్థికి మెజారిటీ రాలేదు. దీంతో జులై 5న రెండో బ్యాలెట్‌ (రన్‌ఆప్‌ పోలింగ్‌)ను నిర్వహించారు. ఈ పోలింగ్‌లో కొత్త అధ్యక్షుడిగా సంస్కరణవాదిని ఇరానియన్లు ఎన్నుకున్నారు.