ఏపీలో 9 మంది ఐపీఎస్ ల బదిలీ..

రాష్ట్రంలో 9 మంది IPS లు బదిలీ అయ్యారు. SPF డీజీగా అంజనా సిన్హా, లా అండ్ ఆర్డర్ DGగా సీహెచ్ శ్రీకాంత్, విజయవాడ CPగా రాజశేఖర్ బాబు, అగ్నిమాపక శాఖ డీజీగా మాదిరెడ్డి ప్రతాప్, లాజిస్టిక్స్ ఐజీగా PHD రామకృష్ణ (పోలీసు నియామక బోర్డు ఛైర్మన్గా అదనపు బాధ్యతలు), కర్నూలు రేంజ్ DIGగా కోయ ప్రవీణ్, గ్రే హౌండ్స్ IGగా గోపీనాథ్ జెట్టి, DGP ఆఫీసులో రిపోర్ట్ చేయాలని విశాల్ గున్నీ, విజయరావులను GOVT ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఏఉత్తర్వులు జారీ చేశారు.