📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump : ఉద్రిక్తతలు తగ్గేందుకు భారత్‌-పాక్‌లు డిన్నర్‌ ఏర్పాటు చేసుకోవాలి : డొనాల్డ్‌ ట్రంప్‌

Author Icon By Sudha
Updated: May 14, 2025 • 2:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌-పాకిస్థాన్‌ (India-Pakistan) దేశాల మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరోసారి వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి రెండు దేశాలు కలిసి మంచి డిన్నర్‌ ఏర్పాటు చేసుకోవాలని సలహా కూడా ఇచ్చారు. అణు క్షిపణుల (Nueclear Missile) తో యుద్ధాలు వద్దని చెప్పారు. సౌదీ అరేబియాలో యూఎస్‌-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోరమ్‌లో ట్రంప్‌ మాట్లాడారు.

Donald Trump : ఉద్రిక్తతలు తగ్గేందుకు భారత్‌-పాక్‌ దేశాలు డిన్నర్‌ ఏర్పాటు చేసుకోవాలి : డొనాల్డ్‌ ట్రంప్‌

ఈ సందర్భంగా ట్రంప్‌ తనను తాను శాంతికర్తగా అభివర్ణించుకున్నారు. అణ్వాయుధ దేశాలైన భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులు హాజరయ్యారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య అణుయుద్ధాన్ని నివారించడానికి తన మధ్యవర్తిత్వం సాయపడిందని ట్రంప్‌ తెలిపారు. అది లక్షలాది ప్రాణాలను కాపాడిందని అన్నారు.
మంచి విందు చేసుకోవచ్చు
ఉద్రిక్తతలు మరింత తగ్గేందుకు భారత్‌, పాకిస్థాన్‌ దేశాలు మంచి డిన్నర్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ‘ఇరుదేశాల మధ్య శాంతి ప్రక్రియలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోలు పాలుపంచుకున్నారు. ఇరు దేశాల పరిస్థితి బాగుందని అనుకుంటున్నా. వాళ్లని మనం ఒకచోట చేర్చవచ్చు. మార్కో రూబియో, వాళ్లు కలిసి బయటకు వెళ్లి మంచి విందు చేసుకోవచ్చు. ఇది బాగుంటుంది కదా?’ అని ట్రంప్‌ ఫోరమ్‌లో వ్యాఖ్యానించారు.
‘కొన్ని రోజుల క్రితమే భారత్‌-పాకిస్థాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడానికి చరిత్రక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలుచేయడంలో మా యంత్రాంగం విజయవంతమైంది. ఈ విషయంలో నేను వాణిజ్య అంశాలను ఎక్కువగా ఉపయోగించాను. సహచరులారా రండి. ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందాం. వ్యాపారం చేద్దాం. అణు క్షిపణుల వాణిజ్యం చేయొద్దు. అందరికీ ఆనందం కలిగేలా చేద్దాం. భారత్‌-పాక్‌ పాలకులు శక్తిమంతమైన, ఉత్తమ, తెలివైన నేతలు. యుద్ధం నిలిచిపోయింది. ఇది అలాగే కొనసాగాలని ఆశిద్దాం’ అని ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా ఆహూతులంతా చప్పట్లతో ట్రంప్‌ను అభినందించారు.
మూడోపక్షం మధ్యవర్తిత్వాన్ని భారత్‌ తిరస్కరిస్తోంది
అయితే కాల్పుల విరమణ విషయంలో మూడోపక్షం మధ్యవర్తిత్వాన్ని భారత్‌ తిరస్కరిస్తోంది. భారత్, పాకిస్థాన్‌లకు చెందిన డైరెక్టర్‌ జనరల్స్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంవోలు) తమంతట తాము అవగాహనకు వచ్చారని, ఈ వ్యవహారంలో మరెవరి ప్రమేయం లేదని భారత ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్‌ మళ్లీమళ్లీ చెప్పుకుంటుండటం గమనార్హం.

Read Also : Pakistan Hackers: పాకిస్తాన్ హ్యాకర్ల నుంచి కీలక ప్రదేశాలపై సైబర్ దాడులు

Breaking News in Telugu dinner to ease tensions: Donald Trump Google news india Latest News in Telugu Pakistan should host Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.