ఇన్వెస్టర్ కనెక్ట్ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్

నిపుణుల మార్గదర్శకత్వంతో నిధుల సమీకరణను వేగవంతం చేయడానికి స్టార్టప్‌లను సన్నద్ధం చేసే ప్రయత్నం

International Startup Foundation conducting Investor Connect Workshop

హైదరాబాద్‌: స్టార్ట్-అప్ వ్యవస్థ యొక్క ఎదుగుదల మరియు అభివృద్ధికి మద్దతునిచ్చే ప్రముఖ లాభాపేక్షలేని సంస్థ, ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌లకు నిలయంగా ఉన్న గ్లోబల్ ఇంక్యుబేషన్ సిటీ, ఇంటర్నేషనల్ స్టార్టప్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎస్ఎన్)తో కలిసి అంతర్జాతీయ స్టార్టప్ ఫెస్టివల్ (ఐఎస్ఎఫ్) 2024ను హైదరాబాద్‌లో మొదటి సారి నిర్వహించేందుకుసిద్దమైనది. ఇది 2024 సెప్టెంబర్ 26 నుండి 28 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI)లో నిర్వహించనున్నారు. ఐఎస్ఎఫ్ 2024 కోసం ఇన్వెస్టర్ కనెక్ట్ వర్క్‌షాప్ మరియు కర్టెన్ రైజర్ ఈరోజు టి – హబ్‌లో నిర్వహించబడింది. స్టార్టప్ వ్యవస్థాపకులు , వారి సహచరులు మరియు పెట్టుబడిదారులతో కనెక్ట్ అవ్వడానికి, వినూత్న ప్రాజెక్ట్‌లలో సహకరించడానికి మరియు వారి వెంచర్‌ల కోసం వృద్ధి మార్గాన్ని వివరించడానికి ఒక ప్రత్యేకమైన వేదికగా ఐఎస్ఎఫ్ 2024 నిలుస్తుంది.

రిజిస్టర్డ్ స్టార్టప్‌ల కోసం ఇన్వెస్టర్ కనెక్ట్ వర్క్‌షాప్ నిర్వహించబడింది, ఇది నిధుల సమీకరణను వేగంగా ట్రాక్ చేయడానికి నిపుణుల నుండి తగిన పరిజ్ఙానం పొందడానికి వీలు కల్పిస్తుంది. 100కి పైగా స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం వహించడం మరియు నిధుల సేకరణలో వారికి సహాయపడే లక్ష్యంతో ఈ వర్క్‌షాప్ నిర్వహించబడింది. శ్రీ జె ఏ చౌదరి – కీ ఆర్కిటెక్ట్ – ఇండియన్ టెక్ ఇండస్ట్రీ, ఫౌండర్ ఐఎస్ఎఫ్ , శ్రీ రాజేష్ రాజు – ఎండి, కలారి క్యాపిటల్స్, శ్రీ శోబు యార్లగడ్డ – సీఈఓ & కో ఫౌండర్ ఆర్కా మీడియా వర్క్స్, శ్రీ ప్రసాద్ వంగా – వ్యవస్థాపకుడు & సీఈఓ, యాంట్ హిల్ వెంచర్స్, శ్రీ సతీష్ ఆంద్ర – ఎండి , ఎండియా పార్ట్‌నర్స్, శ్రీ సంజీవ్ దేశ్‌పాండే – కంట్రీ హెడ్ – NTT డేటా, శ్రీ శ్రీధర్ రాంపల్లి – మేనేజింగ్ పార్టనర్ – పేవ్ స్టోన్, శ్రీ విక్రాంత్ వర్ష్నే – కో ఫౌండర్ & మేనేజింగ్ పార్టనర్ – సక్‌సీడ్ ఇండోవేషన్ ఫండ్ మరియు శ్రీ శ్రీనివాస్ రావు మహంకాళి – సీఈఓ , టి – హబ్‌తో పాటుసహా 10 మందికి పైగా మెంటర్లు , పెద్ద సంఖ్యలో స్టార్టప్ వ్యవస్థాపకులు ఇన్వెస్టర్ కనెక్ట్ వర్క్‌షాప్ మరియు ఐఎస్ఎఫ్ 2024 కర్టెన్ రైజర్‌కు హాజరయ్యారు.

ఐఎస్ఎఫ్ 2024 యొక్క నేపథ్యం ‘ఏఐ యుగంలో ఆవిష్కరణ మరియు వ్యవస్ధాపకత (ఇన్నోవేషన్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ ది ఏజ్ అఫ్ ఏఐ)’. హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, అగ్రిటెక్, ఫుడ్ టెక్నాలజీ, ఫిన్‌టెక్ మరియు రూరల్ ఇన్నోవేషన్స్‌తో సహా వివిధ రంగాలలో ఆవిష్కరణలను నడపడానికి కృత్రిమ మేధస్సు పై ఆధారపడటం పై దృష్టి సారించింది. స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం మరియు స్థిరమైన వృద్ధికి అవకాశాలను సృష్టించడం ఐఎస్ఎఫ్ 2024 లక్ష్యంగా పెట్టుకుంది, ఈ ఫెస్టివల్ స్టార్టప్ ఎక్స్‌పోలో 300 కంటే ఎక్కువ మంది పాల్గొనడంతో పాటు 600 కంటే ఎక్కువ స్టార్టప్‌లను కలిగి ఉంటుంది. అదనంగా, ఇది 800 గ్లోబల్ ఏంజెల్ ఇన్వెస్టర్లు, 300 వెంచర్ క్యాపిటలిస్ట్‌లు మరియు 250 CXOలను కలిగి ఉంటుంది, ఇది గ్లోబల్ ఔట్రీచ్ మరియు నెట్‌వర్క్‌కు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఆశాజనకమైన స్టార్టప్‌లు మరియు అత్యుత్తమ ఆవిష్కర్తలను కూడా ఐఎస్ఎఫ్ 2024 గుర్తిస్తుంది.

ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్ 2024 గురించి ఇండియన్ టెక్ ఇండస్ట్రీ కీ ఆర్కిటెక్ట్ మరియు ఐఎస్ఎఫ్ చైర్‌పర్సన్ మరియు కన్వీనర్ శ్రీ జె ఏ చౌదరి మాట్లాడుతూ, “అంతర్జాతీయ స్టార్టప్ ఫెస్టివల్ ను గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను సంపూర్ణం చేయడానికి, భాగస్వామ్యాలను ప్రోత్సహించటం, ఆవిష్కరణ మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి రూపొందించబడింది. ఈ సంవత్సరం మేము మొదటి సారిగా హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నాము. ఏఐ యుగంలో ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకత నేపథ్యం తో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ , ఏఐ సాంకేతికతలను అట్టడుగు స్థాయి వ్యవస్థాపకతలో ఏకీకృతం చేయడం, స్టార్టప్‌లు వాస్తవ ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను కనుగొనటం మరియు సామాజిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే మా లక్ష్యంకు అనుగుణంగా ఉంటుంది. యుఎస్ఏ మరియు జమైకాలో జరిగిన గ్లోబల్ CXO సమ్మిట్‌లు ఐఎస్ఎఫ్ 2024లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు మరియు పెట్టుబడిదారుల అసాధారణ సమావేశానికి వేదికగా నిలిచాయి.” అని అన్నారు.

ఐఎస్ఎఫ్ నెట్‌వర్క్ డైరెక్టర్ డాక్టర్ శివ మహేష్ టంగుటూరు జోడిస్తూ, “ఐఎస్ఎఫ్ 2024లో భారతదేశం, యుఎస్ఏ మరియు ఇతర దేశాల నుండి 50,000 స్టార్టప్‌లు పాల్గొంటాయి. టాప్ 100 స్టార్టప్‌లు ఫైనలిస్ట్‌లుగా ఎంపిక చేయబడతాయి, వేదికపై తమ ఆలోచనలు పంచుకోవటానికి మరియు నిధులను పొందేందుకు వారికి ప్రత్యేకమైన అవకాశం కలుగుతుంది. ఈ స్టార్టప్‌లు పూణే, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, యుఎస్ఏ , యూరప్ మరియు ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగిన ఇన్వెస్టర్ కనెక్ట్ వర్క్‌షాప్‌ల నుండి షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి. రూరల్ ఇన్నోవేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించే ఏకైక వేదిక ఐఎస్ఎఫ్ – మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సాంకేతికతతో కూడిన పరిష్కారాలను కనుగొనడానికి గ్రాస్ రూట్ స్థాయిలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రూరల్ ఎకనామిక్ ఫోరమ్‌ను నిర్వహిస్తుంది. తదుపరి తరం ఆవిష్కర్తలను ప్రోత్సహించడానికి, జూనికార్న్ రౌండ్‌టేబుల్‌ను నిర్వహించే ఏకైక ఫోరమ్ ఐఎస్ఎఫ్ . ఇది హెల్త్-టెక్, ఫిన్‌టెక్, అగ్రిటెక్, డిఫెన్స్ & స్పేస్‌టెక్, ఎడ్‌టెక్, కన్స్యూమర్ టెక్, వీఎల్‌ఎస్‌ఐ & ఎంబెడెడ్ టెక్ మరియు మరిన్ని వంటి కీలకమైన విషయాలపై చర్చలూ ఉంటాయి. ప్రత్యేక రౌండ్‌టేబుళ్లు వ్యాపారంలో మహిళలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌లు మరియు జూనికార్న్స్ వంటి అంశాలను కవర్ చేస్తాయి, ఆలోచనాపరులు మరియు విధాన రూపకర్తలకు అట్టడుగు సవాళ్లను పరిష్కరించడానికి మరియు ప్రభావవంతమైన పరిష్కారాలను ప్రతిపాదించడానికి వేదికను అందిస్తాయి. స్టార్టప్ వ్యవస్థాపకులతో నెట్‌వర్క్ చేయడానికి మరియు వినూత్న ఉత్పత్తులు మరియు పరిష్కారాలను అన్వేషించడానికి ప్రతినిధులకు శక్తివంతమైన వాతావరణాన్ని అందించడానికి మూడు రోజుల స్టార్టప్ ఎక్స్‌పో కూడా జరుగుతుంది. ఈ ఎక్స్‌పోలో 15 కంటే ఎక్కువ దేశాలు మరియు వివిధ భారతీయ రాష్ట్రాల నుండి పెవిలియన్లు ఉంటాయి, ఇవి విభిన్న మరియు డైనమిక్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రదర్శిస్తాయి..” అని అన్నారు.

ఇంటర్నేషనల్ స్టార్టప్స్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్ శ్రీ బాలాజీ రెడ్డి మాట్లాడుతూ “హైదరాబాద్‌లో మొదటి అంతర్జాతీయ స్టార్టప్ ఫెస్టివల్‌ని నిర్వహించడానికి ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం చేసుకున్నందుకు మేము సంతోషిస్తున్నాము. మేము గ్లోబల్ ఇంక్యుబేషన్ సిటీని ఏర్పాటు చేస్తున్నాము, ఇది ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌లను కలిగి ఉంటుంది. ఇది దాని నెట్‌వర్కింగ్ క్లబ్ మరియు కో వర్క్‌స్పేస్ కలిగి ఉంటుంది. దీనిలో ఇన్వెస్టర్ విసి స్టూడియోస్, మెంటర్లు, కార్పొరేట్‌లు వ్యాపారాలను స్టార్టప్‌లకు కనెక్ట్ చేయనున్నాయి. హైదరాబాద్‌లో ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా ఇది నిలవనుంది. ఐఎస్ఎన్ ఐఎస్ఎఫ్ కోసం ఫిజికల్ ఇంక్యుబేషన్ పార్టనర్‌గా కూడా పని చేస్తుంది మరియు స్టార్టప్‌ల కోసం శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది…” అని అన్నారు.

ఐఎస్ఎఫ్ 2024ని గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి ప్రారంభించే అవకాశాలు వున్నాయి. అనేక మంది విధాన రూపకర్తలు, పరిశ్రమల నాయకులు మరియు విజయవంతమైన స్టార్టప్ వ్యవస్థాపకులు విజయవంతమైన సంస్థలను అభివృద్ధి చేయడానికి అవసరమైన పరిజ్ఞానం పంచుకునే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్ 2024 కు పవర్డ్ బై పార్టనర్ గా వంశీరామ్ బిల్డర్స్ మరియు కో- పవర్డ్ బై పార్టనర్ గా NTT డేటా వ్యవహరిస్తున్నాయి.

KEY HIGHLIGHTS: ముఖ్య అంశాలు:

ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్ (ఐఎస్ఎఫ్)2024 ను 2024 సెప్టెంబర్ 26 నుండి 28 వరకు ‘ఏఐయుగంలోఆవిష్కరణ & వ్యవస్థాపకత’ అనేనేపథ్యంతో ESCI, గచ్చిబౌలి, హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

ఐఎస్ఎఫ్ 2024 ఎక్స్‌పోలో 800+ గ్లోబల్ ఏంజిల్స్, 300+ విసి లు, 250+ CXOలు, 600 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు, 300+ మంది పార్టిసిపెంట్స్ రానున్నారని అంచనా.

ఐఎస్ఎఫ్ 2024లో పాల్గొనడానికి యుఎస్ఏ.

ఐఎస్ఎఫ్ 2024 ‘పిచ్ ఫెస్ట్’ను నిర్వహించేందుకు,20 రంగాల్లోని 50,000 నమోదిత స్టార్టప్‌ల నుండి 100 మంది ఫైనలిస్ట్‌లు షార్ట్‌లిస్ట్ చేయబడి , నిధులను సేకరించేందుకు అవకాశం కల్పించారు.

ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్ 2024కు పవర్డ్ బై పార్టనర్ గా వంశీరామ్ బిల్డర్స్ వ్యవరిస్తుంది. ‘ఐఎస్ఎన్ – ఇంటర్నేషనల్ స్టార్టప్ నెట్‌వర్క్’ మద్దతుఅందిస్తుంది, ఇదిప్రపంచవ్యాప్తంగాస్టార్టప్‌లను కలిగిఉంది. ఐఎస్ఎఫ్ కి ఐఎస్ఎన్ ఫిజికల్ ఇంక్యుబేషన్ భాగస్వామిగా ఉంటుంది.