పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణులు

అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంది. డయాఫ్రం వాల్, స్పిల్ వే వంటి ప్రధాన నిర్మాణాలతో పాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పరిశీలించారు. అమెరికా, కెనడాల నుంచి 4 గురు నిపుణులు వచ్చారు. కేంద్ర, రాష్ట్ర జలనరుల శాఖ అధికారులతో నిన్న దిల్లీలో నిపుణులు బృందం సమావేశం అయ్యారు. అనంతరం రాత్రి రాజమండ్రికి చేరుకున్న నిపుణులు, పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులతో భేటీ అనంతరం ప్రాజెక్ట్ సైట్​ను పరిశీలిస్తున్నారు.

అధికారులను అడిగి ప్రాజెక్టు వివరాలు తెలుసుకుంటున్నారు. కెనడాకు చెందిన నలుగురు నిపుణులు శనివారం దిల్లీకి చేరుకున్నారు. నేటి నుంచి వారు పోలవరంలో తమ పని ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ నిపుణులు అక్కడే ఉంటారు. ఒక్కోరోజు ఒక్కో విభాగాన్ని పరిశీలించి ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందజేయనున్నారు. ఈ నివేదికను బట్టే పనులపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.