Interest rates on small savings schemes remain unchanged

Central Govt : యథాతథంగా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు

Central Govt: కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ వంటి పథకాల వడ్డీ రేట్లలో ఈసారీ మార్పు చేయలేదు. 2025 ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 వరకు ప్రస్తుత వడ్డీ రేట్లే ఉంటాయని ఆర్థిక శాఖ తెలిపింది. వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలకు 2024-25 నాలుగో త్రైమాసికానికి (జనవరి- మార్చి) నోటిఫై చేసిన వడ్డీ రేట్లే వచ్చే ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి వర్తిస్తాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇలా వడ్డీ రేట్లు మార్చకపోవడం ఇది వరుసగా ఐదోసారి.

Advertisements
 యథాతథంగా చిన్న మొత్తాల పొదుపు

మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లకు 7.1% వడ్డీ రేటు

నోటిఫికేషన్‌ ప్రకారం.. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద చేసే డిపాజిట్లకు 8.2% వడ్డీ రేటు లభిస్తుంది. మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లకు 7.1% వడ్డీ రేటు కొనసాగుతుంది. పీపీఎఫ్‌కూ ఇదే వడ్డీ రేటు వర్తిస్తుంది. పోస్టాఫీస్‌ పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేట్లు కూడా ఎలాంటి మార్పు లేకుండా 4 శాతమే కొనసాగనుంది. కిసాన్‌ వికాస్‌ పత్ర పథకానికి వడ్డీ రేటు 7.5% (115 నెలలకు మెచ్యూరిటీ), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ పథకానికి 7.7%, నెలవారీ ఆదాయ పథకంపై 7.4% వడ్డీ రేటు లభించనుంది. చివరి సారిగా 2023-24 నాలుగో త్రైమాసికంలో ఈ వడ్డీ రేట్లను సవరించింది. ప్రతి త్రైమాసికానికి వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంటుంది.

Related Posts
పార్టీ పదవికి శివసేన ఎమ్మెల్యే రాజీనామా
Narendra Bhondekar

మహరాష్ట్రలో బీజేపీ కూటమి గెలుపు పొందినప్పటినుంచి సీఎం, మంత్రి పదవుల పై కసరత్తులు జరుగుతున్నా, ఇంకా అక్కడ దీనిపై స్పష్టత రావడం లేదు. తాజాగా మంత్రి పదవిని Read more

Amit Shah: హిందీ ఏ భాషకూ పోటీ కాదు : అమిత్ షా
Amit Shah హిందీ ఏ భాషకూ పోటీ కాదు అమిత్ షా

Amit Shah: హిందీ ఏ భాషకూ పోటీ కాదు : అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భాషల మధ్య విభేదాలకు తావులేదని స్పష్టం చేశారు. Read more

కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్
cm revanth

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం దిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా హాజరుకానున్నారు. రాష్ట్ర Read more

సోషల్ మీడియా విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక ప్రకటన
Social media ban for UK und

ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేని ఓ కీలక చట్టం అమలు చేయబోతోంది. సోషల్ మీడియాలో 16ఏళ్ల లోపు పిల్లలను బ్యాన్ చేసే బిల్లుకు అక్కడి ప్రతినిధుల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×