ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 సంవత్సరానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటించింది. విద్యార్థులకు అదనపు అవకాశం కల్పించడానికి సప్లిమెంటరీ పరీక్షలు మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలు వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు రెండవ సెషన్ జరుగుతుంది.

పరీక్షల ఫలితాలు
ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలు శనివారం విడుదలయ్యాయి. దాదాపు 10.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. మొదటి సంవత్సరం 70% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు, కాగా ద్వితీయ సంవత్సరం 83% ఉత్తీర్ణత రేటు నమోదు చేసుకుంది. ఈ ఏడాది ఫలితాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు నిరాశ చెందవద్దని, వచ్చే నెలలో నిర్వహించనున్న సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని సూచించారు.
పరీక్ష ఫీజులు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు 15 నుండి 22 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఫీజు చెల్లించకపోతే, విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం కోల్పోతారు. అలాగే, రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్ ఫీజులు కూడా వెల్లడించారు.
రీకౌంటింగ్ మరియు రీ-వెరిఫికేషన్
ఇంటర్ పరీక్ష ఫలితాలపై అభ్యంతరాలు ఉంటే, రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ ఫీజులు కూడా ప్రకటించారు. విద్యార్థులు ఈ సేవలను పొందడానికి ఏప్రిల్ 13 నుంచి 22 వరకు ఫీజు చెల్లించవచ్చు.
ప్రాక్టికల్ ఎగ్జామ్స్
ప్రాక్టికల్ పరీక్షలు 2025 సంవత్సరంలో మే 28 నుండి జూన్ 1 వరకు జరగనుండగా, విద్యార్థులు తమ ప్రాక్టికల్ పరీక్షలు కూడా ఈ వ్యవధిలో పూర్తి చేయవలసి ఉంటుంది.
Read also: AP ఇంటర్ 1వ ద్వితీయ సంవత్సరం ఫలితాలు 2025 resultsbie.ap.gov.in లో ప్రకటించబడ్డాయి.