ఇంటర్‌ సిటీ బస్సు ‘వీర మహాసామ్రాట్ ఈవీ’

ప్రపంచంలోనే మొదటి 15 నిమిషాలలో ఛార్జింగ్

Inter City Bus ‘Veera Mahasamrat EV’

హైదరాబాద్: వీర వాహన, ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ భాగస్వామ్యంతో ఇంటర్‌ సిటీ బస్సు ‘వీర మహాసామ్రాట్ ఈవీ’ ని ప్రకటించారు. ఈ ఈవీ బస్సు ప్రత్యేకత ఏమిటంటే.. 15 నిమిషాలలో ఛార్జింగ్ అవుతుంది. ప్రపంచంలోనే మొదటిది. ఎక్స్‌పోనెంట్ 1 ఎండబ్ల్యు ఛార్జింగ్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ బస్సు 15 నిమిషాల్లో వేగంగా ఛార్జ్ చేయగలదు. 2 – యాక్సిల్స్‌లో ప్రపంచంలోని మొట్టమొదటి 13.5ఎం ఈవీ బస్సు ఎక్స్‌పోనెంట్ 320 కేడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్, ఆరు లక్షల కిలోమీటర్లు/3000 లైఫ్ సైకిల్ బ్యాటరీ వారంటీతో వస్తుంది. బెంగళూరు – హైదరాబాద్ మార్గంలో కార్యకలాపాలు ప్రారంభించడంపై దృష్టి సారించాయి. ఎక్స్‌పోనెంట్ నాలుగు ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తుంది. సులభమైన ఫైనాన్సింగ్ సౌలభ్యం కలదు. ఐసీఈ బస్సుతో పోలిస్తే నిర్వహణ ఖర్చులను 30 శాతం తగ్గిస్తుంది. వేగవంతమైన ఛార్జింగ్, హైవేల వెంట ఎక్స్‌పోనెంట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌తో బస్సు ఆపరేటర్లు రేంజ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఈ సందర్భంగా వీర వాహన మేనేజింగ్ డైరెక్టర్ కే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఛార్జింగ్ సమయం కారణంగా ఎలక్ట్రిక్ బస్సులు ఇంట్రాసిటీ కార్యకలాపాలకు పరిమితం చేయబడ్డాయన్నారు. 600 కిలోమీటర్లు కోసం ఎక్కువ ఛార్జింగ్ సమయంతో ఒకే బ్యాటరీని ప్యాక్ చేయడం కష్టమన్నారు. వినియోగదారులు హైవే వెంట ఒక గంట పాటు వేచి ఉండడానికి ఇష్టపడరన్మారు. డీజిల్ బస్సులు ప్రతి 300 కిలోమీటర్లకు 15 నుంచి 20 నిమిషాల పాటు ఆగుతాయన్నారు. ఎక్స్‌పోనెంట్‌తో మా ప్రత్యేక భాగస్వామ్యం అదే అనుభవాన్ని అనుకరిస్తుందన్నారు. బస్ ఆపరేటర్లు వీర మహాసామ్రాట్ ఈవీతో ఎలక్ట్రిక్‌కు మారవచ్చన్నారు. ఈ సందర్భంగా ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ సహ-వ్యవస్థాపకుడు, సీఈవో అరుణ్ వినాయక్ మాట్లాడుతూ సుదీర్ఘ దూర ఇంటర్‌సిటీ బస్ సెగ్మెంట్‌ను విద్యుదీకరించడానికి బస్ పరిశ్రమలో అనుభవజ్ఞుడైన వీర వాహనతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోని మూడో 1 ఎండబ్ల్యు ఛార్జింగ్ టెక్నాలజీ టెస్లా, సీమాన్స్ తర్వాత భారతదేశం కోసం రూపొందించినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. 15 నిమిషాలలో వేగంగా ఛార్జింగ్ అవుతుందన్నారు. ఎక్స్‌పోనెంట్ నెట్‌వర్క్ ద్వారా అందించే యాక్సెసిబిలిటీతో భారతదేశం మొత్తాన్ని ఎలక్ట్రిక్‌గా మార్చడానికి కట్టుబడి ఉన్నామన్నారు.