Inquiry on petitions of Telangana and AP IAS in CAT today

నేడు క్యాట్‌లో తెలంగాణ, ఏపీ ఐఏఎస్‌ల పిటిషన్ల పై విచారణ

హైదరాబాద్‌: కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశాలతో తెలంగాణ, ఆంధ్రాలో కొనసాగుతున్న ఐఏఎస్,ఐపీఎస్‌ కేడర్​ అధికారులు పునర్విభజన యాక్ట్​ ప్రకారం తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్‌ చేయాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం (డీఓపీటీ) ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు డీఓపీటీ కార్యదర్శి ఆర్డర్స్​ సైతం జారీ చేశారు. ఈ క్రమంలోనే డీఓపీటీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఏపీ, తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్‌లు క్యాట్‌ను ఆశ్రయించారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లపై క్యాట్‌లో మంగళవారం విచారణ జరగనుంది.

గతంలో ఏపీకి కేటాయించి ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌ ఆఫీసర్స్​ వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్‌ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతి, ఐపీఎస్‌ కేడర్ అంజనీ కుమార్, అభిలాశ్​ బిస్త్, అభిషేక్‌ మహంతి ఉన్నారు. ఇక ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన వారిలో ఐఏఎస్‌ ఆఫీసర్లు సృజన, శివశంకర్, హరికిరణ్‌ ఉన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లేందుకు అప్లికేషన్​ పెట్టుకున్న ఎస్‌.ఎస్‌.రావత్, అనంతరాము అభ్యర్థనలను డీవోపీటీ రిజక్ట్​ చేసింది. దీంతో వీరిద్దరూ ఏపీలోనే కొనసాగనున్నారు. కాగా, క్యాట్ ఐఏఎస్‌ల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటుందా? లేదా అనేది నేడు తేలనుంది.

Related Posts
తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా
Priyanka Gandhi Vadra entered the Lok Sabha for the first time

న్యూఢిల్లీ: వయనాడ్‌ ఎంపీగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రియాంక తన తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ, సోదరుడు, Read more

ఏపీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు యథాతథం ..
Public examinations in the first year continues as usul

అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్‌ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు వచ్చే ఏడాది నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని సర్కార్ Read more

కుంభమేళాలో ములాయం సింగ్ విగ్రహం!
కుంభమేళాలో ములాయం సింగ్ విగ్రహం!

ములాయం సింగ్ యాదవ్ స్మృతి సేవా సంస్థాన్ ఏర్పాటు చేసిన సెక్టార్ 16 లోని శిబిరంలో రెండు-మూడు అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని శనివారం ప్రారంభించినట్లు ఉత్తరప్రదేశ్ Read more

సంగారెడ్డిలో భారీగా పట్టుబడిన డ్రగ్స్‌
drugs3

డ్రగ్స్ కంట్రోల్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితం రావడం లేదు. తాజాగా సంగారెడ్డిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. న్యూ ఇయర్ దగ్గ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *