PVR Inox IPL

PVR Inox IPL: ఐపీఎల్ మ్యాచ్‌ల ప్ర‌సారం కోసం బీసీసీఐతో పీవీఆర్ ఐనాక్స్ ఒప్పందం

ప్రముఖ సినిమా చైన్ పీవీఆర్ ఐనాక్స్,భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐనాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈరోజు నుంచి ఐపీఎల్ 2024 (18వ సీజన్) మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Advertisements

థియేటర్లలోనే స్టేడియం అనుభూతి

ఈరోజు జరిగే ఐపీఎల్ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకతో పాటు తొలి మ్యాచ్ నుంచి వీకెండ్ మ్యాచులు, ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లను కూడా థియేటర్లలో వీక్షించే అవకాశం ఉంది.”ప్రపంచ స్థాయి సౌండ్ సిస్టమ్, హై-క్వాలిటీ విజువల్స్, కంఫర్టబుల్ సీటింగ్ ద్వారా ప్రేక్షకులు స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ఫీలింగ్‌ను పొందుతారు”, అని ఐనాక్స్ తెలిపింది.

మళ్లీ డీల్

గత సీజన్‌లో కూడా ఐపీఎల్ మ్యాచ్‌లను కొన్ని థియేటర్లలో ప్రసారం చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. దీన్ని బట్టి ఈసారి మరింత ఎక్కువ థియేటర్లలో ప్రదర్శించడానికి నిర్ణయించామని పీవీఆర్ ఐనాక్స్ రెవెన్యూ, ఆపరేషన్స్ సీఈఓ గౌతం దత్తా తెలిపారు.”సినిమాను, క్రికెట్‌ను ఒకే వేదికపైకి తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది. థియేటర్‌లో మ్యాచ్‌లను చూసే అనుభూతి అభిమానులకు ఓ ప్రత్యేకమైన ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది”, అని పేర్కొన్నారు.

PVR Inox IPL

ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఆఫర్లు

ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ప్రత్యేకంగా పాప్‌కార్న్-బెవరేజెస్ కాంబో ఆఫర్లు,దగ్గరలోని ఐనాక్స్ మల్టీప్లెక్స్ లేదా ఐనాక్స్ యాప్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం,మూవీ లవర్స్‌తో పాటు క్రికెట్ అభిమానులను ఆకట్టుకునేలా ప్రత్యేక ప్రణాళికలు.

ఐపీఎల్ 2025 థియేటర్ టెలికాస్ట్

మార్చి 22న ఐపీఎల్ ప్రారంభం ,స్ట్రీమింగ్ , వీకెండ్ మ్యాచులు, ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం,స్టేడియం స్థాయి అనుభూతి – హై డెఫినిషన్ విజువల్స్ డాల్బీ ఆడియో,పీవీఆర్, ఐనాక్స్ యాప్‌ల ద్వారా టిక్కెట్ బుకింగ్ సౌకర్యం.ఐపీఎల్ అంటేనే క్రికెట్ ప్రేమికులకి పండుగ. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఇక దాదాపు 3 నెలల పాటు అంతులేని వినోదాన్ని పంచేందుకు,సంబరాల్లో ముంచెత్తేందుకు వచ్చేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. మ్యాచ్‌ల్ని నేరుగా స్టేడియంకు వెళ్లి చూడాలనుకునే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. కానీ టికెట్ రేట్లు ఎక్కువ ఉంటాయి. స్టేడియం సామర్థ్యం తక్కువ ఉంటుంది. కాబట్టి స్టేడియాలకు వెళ్లలేని వారు.ఇంట్లో టీవీలలో కాకుండా ప్రేక్షకులు పెద్ద స్క్రీన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది.సినిమా ఎగ్జిబిటర్‌ పీవీఆర్‌ ఐనాక్స్‌. తాజాగా దీన్ని మరింత రంగురంగులం చేయడానికి పీవీఆర్ ఐనాక్స్ – బీసీసీఐ ఒప్పందం కీలకంగా మారింది.

Related Posts
Tamanna: శివశక్తి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం:తమన్నా
Tamanna: శివశక్తి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం:తమన్నా

తమన్నా నాయిక ప్రధానమైన పాత్రలను పోషిస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే హారర్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలలోను గట్టిగానే కనిపిస్తోంది. అలా ఈ మధ్య వచ్చిన Read more

పోసానికి వైద్యపరీక్షలు పూర్తి
పోసానిపై పలు స్టేషన్లలో 30 కి పైగా ఫిర్యాదులు

వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనంతరం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌ కు తీసుకువచ్చిన పోలీసులు, అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ Read more

తెలుగు మాట్లాడని వారికి ఓటేయొద్దు: వెంకయ్యనాయుడు
venkaiah naidu

తెలుగు భాష కమ్మదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మన భాషను మనమే నిర్లక్ష్యం చేస్తున్నాము అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగులో మాట్లాడని వారికి Read more

కేటీఆర్‌ఫై విచారణకు గవర్నర్ ఆమోదం
KTR Congress

తెలంగాణలో చలికాలంలో రాజకీయ వేడిని పుట్టిస్తున్నది. ఇక్కడి రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకోనుంది. ఫార్ములా ఈ-కారు రేసులో అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×