భారత వలసదారుల పట్ల అమానవీయ ప్రవర్తన

అమెరికాలో నివసించే అక్రమ వలసదారులు, వారిని తరలించిన విధానం దేశ రాజకీయాల్లో చిచ్చుపెట్టింది. దీనిపై కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా తీవ్ర అభ్యంతరాన్ని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన వైఖరేంటో తెలియజేయాలంటూ పట్టుబట్టింది. సమగ్ర చర్చ జరగాలంటూ డిమాండ్ చేస్తోంది. ఈ పరిస్థితుల మధ్య అమెరికా ఓ వీడియోను విడుదల చేసింది. ఈ రాజకీయ రచ్చకు మరింత ఆజ్యం పోసేలా ఉందా వీడియో. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ చీఫ్ మైఖెల్ డబ్ల్యూ బ్యాంక్స్ దీన్ని విడుదల చేశారు. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

అమెరికా ఆర్మీకి చెందిన సీ-17 విమానాన్ని ఎక్కుతున్నప్పుడు చిత్రీకరించిన వీడియో ఇది. 24 సెకెండ్ల నిడివి ఉన్న ఈ వీడియో భారత అక్రమవలసదారుల పట్ల ఆ దేశం ఎంత అమానవీయంగా ప్రవర్తించిందనే విషయానికి అద్దం పట్టింది. అక్రమవలస దారుల కాళ్లకు గొలుసులు, చేతులకు బేడీలు వేసి ఉండటం ఇందులో కనిపించింది. అమెరికా చర్య- దేశ సార్వభౌమతాన్ని ప్రశ్నించినట్టయిందని వ్యాఖ్యానించారు. దౌత్యపరంగా కేంద్ర ప్రభుత్వం తన నిరసనను తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వాళ్లేమీ క్రిమినల్స్ కాదని గుర్తు చేశారు. దీనిపై చర్చించడానికీ కేంద్రానికి తీరిక దొరకట్లేదంటూ విమర్శించారు.

Related Posts
ప్రపంచ వాతావరణ మార్పును ఎదుర్కొనే యునైటెడ్ నేషన్స్ వేదిక
Flag of the United Nations.svg

యునైటెడ్ నేషన్స్ (యూ.ఎన్.) వాతావరణ చర్చలు అన్ని దేశాలకు వాతావరణ మార్పును ఎదుర్కొనేందుకు ఒక వేదికను అందిస్తాయి. ఈ చర్చలు ప్రతీ సంవత్సరం జరిగే గ్లోబల్ సమాగమంగా Read more

ఇండోర్‌లో క్రికెట్ జట్టు విజయోత్సవ ఊరేగింపులో మత హింసలు
ఇండోర్‌లో క్రికెట్ జట్టు విజయోత్సవ ఊరేగింపులో మత హింసలు

ఆదివారం అర్థరాత్రి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలోని మోవ్ పట్టణంలోని కొన్ని మతపరంగా సున్నితమైన ప్రాంతాలలో ఉద్రిక్తత నెలకొంది. భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ విజయాన్ని Read more

‘స్వర్ణిమ’ పేరుతో మహిళలకు కొత్త పథకం తీసుకొచ్చిన మోడీ సర్కార్‌
Modi government has brought a new scheme for women named Swarnima

న్యూఢిల్లీ: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన పథకాలను గతంలో కూడా Read more

Tihar Jail : మరో చోటుకు తిహార్ జైలు తరలింపు
tihar jail

ఆసియాలోనే అతిపెద్దదైన తిహార్ జైలును మరో ప్రాంతానికి తరలించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లో కొత్త జైలు నిర్మాణానికి అవకాశం ఉండడంతో, ప్రభుత్వం దీనికి Read more