400 మంది ట్రైనీలను తొలగించిన ఇన్ఫోసిస్

400 మంది ట్రైనీలను తొలగించిన ఇన్ఫోసిస్

భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్, కర్ణాటకలోని మైసూరు క్యాంపస్‌లో దాదాపు 400 మంది ట్రైనీలను తొలగించినట్లు సమాచారం. నివేదికల ప్రకారం, ఎవాల్యూయేషన్ టెస్ట్ లో విఫలమైన కారణంగా ఈ ఉద్యోగులను కంపెనీ తొలగించింది. ఇన్ఫోసిస్ ఇటీవల ఫ్రెషర్ రిక్రూట్‌మెంట్ నిర్వహణపై విమర్శలను ఎదుర్కొంటోంది. గతంలో కంపెనీ కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకున్నప్పటికీ, 2024లో చేరిన వారిలో దాదాపు సగం మంది ట్రైనీలను ఇప్పుడు తొలగించిన్నటు నివేదికలు సూచిస్తున్నాయి.

Advertisements
400 మంది ట్రైనీలను తొలగించిన ఇన్ఫోసిస్1

కంపెనీ తీసుకున్న నిర్ణయానికి ప్రధాన కారణం ఎవాల్యూయేషన్ టెస్ట్ లో వరుసగా మూడు సార్లు విఫలమవడం అని తెలుస్తోంది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి టెర్మినేషన్ లెటర్లు జారీ చేసినట్లు సమాచారం. ట్రైనీలను బ్యాచ్‌ల వారీగా పిలిచి, లెటర్ పై సంతకం చేయమని అడిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. తమ పేర్లు గోప్యంగా ఉంచాలని కోరుకున్న బాధితులలో ఒకరు, కంపెనీ ఉద్దేశపూర్వకంగా పరీక్షలను కఠినతరం చేసిందని ఆరోపించారు. ఈ ప్రక్రియ మొత్తం అన్యాయంగా ఉందని అన్నారు. 2022-23 నియామక ప్రక్రియలో భాగంగా, ఇన్ఫోసిస్ సిస్టమ్ ఇంజనీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ వంటి ఉద్యోగాల కోసం క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా 2,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. 2022లో పట్టభద్రులైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు అందినా, ఆన్‌బోర్డింగ్‌లో డిలే జరిగింది.

ఈ డిలేకు సంబంధించి అధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. చివరికి, ఏప్రిల్ 2024లో ఆ అభ్యర్థులను ఉద్యోగంలోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు, వారిలో సగం మందిని తొలగించడం ద్వారా ఉద్యోగుల సంఖ్య తగ్గించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సంఘటనపై ఇన్ఫోసిస్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, ఈ రిక్రూట్‌మెంట్ విధానంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related Posts
Tirumala: మరోసారి శ్రీవారి ఆలయంపై నుంచి విమానం.. టీటీడీ ఆగ్రహం !
Once again, a plane flies over Srivari Temple.. TTD is angry!

Tirumala: మరోసారి తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానం వెళ్లింది. దీంతో టీటీడీ తీవ్రంగా మండిపడింది. ఇప్పటికే పలుమార్లు కేంద్ర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం Read more

రజనీకాంత్ జైలర్ 2 టీజర్ విడుదల
రజనీకాంత్ జైలర్ 2 టీజర్ విడుదల

జైలర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన తరువాత, మేకర్స్ ఇప్పుడు దాని సీక్వెల్ను ప్రకటించారు. మకర సంక్రాంతి సందర్భంగా, రజనీకాంత్ నటించిన జైలర్ 2 మేకర్స్ Read more

ఏపీలో ప్రత్యేకమైన వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలు!
ఏపీలో ప్రత్యేకమైన వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలు

ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ సేవలను ప్రజలకు అందించేందుకు ప్రత్యేకమైన పథకాన్ని ప్రారంభించింది. ఇది గవర్నెన్స్ కోసం మరింత సులభతరం చేసేందుకు Read more

CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు
CBI searches former CM Bhupesh Baghel house

CBI Raids: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ నివాసానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు చేరుకున్నారు. ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు Read more

×