ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ గృహాలు – మంత్రి ఉత్తమ్

వరదల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో ఏపీ-తెలంగాణలోని చాలా ప్రాంతాలు జలమయయ్యాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో జన జీవనం స్తంభించిపోయింది. భారీ వరదతో ఊళ్లకు ఊళ్లు నీట మునిగాయి. ఇప్పటికీ చాలా కాలనీలు ముంపులోనే ఉన్నాయి. ఇళ్లు, వాకిలి కొట్టుకుపోయి కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మిగిలారు. ఇప్పుడిప్పుడే వరదలు తగ్గుముఖం పట్టడం తో జనాలు ఊపిరిపీల్చుకున్నారు.

మరోపక్క ప్రభుత్వ అధికారులు , నేతలు సైతం ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. నిన్న సూర్యాపేట (D) హుజూర్నగర్లోని వరద బాధిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు. రోడ్లు, చెరువుల మరమ్మతులు వెంటనే చేపడతామన్నారు. ఇళ్లలోకి నీరు చేరి నష్టపోయిన వారికి రూ. 10వేలు, పశువులు మరణిస్తే రూ.50,000, గొర్రెలు, మేకలు మరణిస్తే రూ.5,000 ఇస్తామని పేర్కొన్నారు.