flight

అమెరికా నుంచి వెనక్కి వచ్చిన భారతీయులు

అమెరికాలో నివసించే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోన్నారు. కరడుగట్టిన నేరస్తులతో సమానంగా భావిస్తోన్నారు. ఈ విషయంలో భారత్ కూడా మినహాయింపు కాదు. అన్ని దేశాలకు చెందిన అక్రమ వలసదారుల భరతం పడుతున్నారు.అక్రమంగా నివసించే భారతీయులను వెనక్కి పంపించే కార్యక్రమానికి అమెరికా తెర తీసింది కూడా. వారిని ఆ దేశ ప్రభుత్వమే వెనక్కి పంపిస్తోంది. విదేశాంగం- రక్షణ మంత్రత్వ సంయుక్తంగా ఈ ఏరివేతను చేపట్టాయి. తొలి దశలో 205 మంది భారతీయులను మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ ఎక్కించింది. మంగళవారమే సీ-17 ఫ్లైట్ టెక్సాస్లోని శాన్ అంటానియో విమానాశ్రయం నుంచి బయలుదేరింది.

కొద్దిసేపటి కిందటే భారత్‌కు చేరుకుంది. పంజాబ్‌ అమృత్‌సర్‌లోని శ్రీగురు గోవింద్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ ఉదయమే ఈ విమానం వస్తుందని భావించనప్పటికీ- అది వాస్తవ రూపాన్ని దాల్చలేదు. ఈ 205 మంది కోసం అమృత్‌సర్ విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఇమ్మిగ్రెంట్స్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. అమెరికాలో నేరాలకు పాల్పడి ఉండొచ్చనే కారణంతోనే ప్రత్యేకంగా తనిఖీలను నిర్వహించినట్లు గౌరవ్ యాదవ్ తెలిపారు.

వీరిలో 104 మంది అమృత్‌సర్‌, సమీప ప్రాంతాలకు చెందిన వాళ్లే. కపుర్తలావాసులు అధికంగా ఉన్నారిందులో. 33 మంది హర్యానా, గుజరాతీయులు. అమృత్‌సర్ టౌన్- 5, జలంధర్-, పటియాలా-4, హోషియార్‌పూర్- 2, లూధియానా- 2, ఎస్‌బీఎస్ నగర్, గుర్దాస్‌పూర్, తర్న్ తరణ్, సంగ్రూర్, మొహాలి, ఫతేపూర్ సాహిబ్‌కు చెందిన వాళ్లు ఒక్కొక్కరు ఉన్నారు. ఈ 205 మందిని స్వదేశానికి పంపించడం పట్ల భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించింది. అక్రమ వలసదారులను అరికట్టే క్రమంలో దేశ సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేసుకుంటోన్నామని తెలిపింది. ఇమ్మిగ్రేషన్స్ చట్టాలను మరింత కఠినతరం చేస్తోన్నామని పేర్కొంది. అక్రమంగా తమ దేశంలో నివసించే వారి పట్ల ఉపేక్షించదలచుకోవట్లేదని తమ ప్రభుత్వం భావిస్తోందని వివరించింది.

Related Posts
కొనసాగుతున్న టెక్ ఉద్యోగుల తొలగింపు
tech employees

ప్రముఖ గ్లోబల్ CRM సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ అయిన సేల్స్‌ఫోర్స్ భారీ తొలగింపు ప్లాన్స్ ప్రకటించింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇంకా గూగుల్ ఈ ఏడాది 2025లో ఉద్యోగుల తొలగింపులను Read more

TGMC దాడి: కాజీపేట, హన్మకొండలో నకిలీ వైద్యులపై కఠిన చర్యలు
medicine scaled

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) వారు, నవంబర్ 17, ఆదివారం, కాజీపేట మరియు హన్మకొండ జిల్లాల్లోని నకిలీ వైద్యులు క్లినిక్‌లపై రైడ్ నిర్వహించారు. ఈ రైడ్లలో మూడు Read more

ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి
AAP Punjab MLA Gurpreet Gog

పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ నియోజకవర్గ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్రోత్ బస్సి గోగీ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో తన Read more

కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఉరట
High Court orders not to arrest KTR for ten days

హైదరాబాద్‌: ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో డబ్బుల గోల్ మాల్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *