Indian Railways stopped Maha Kumbh Mela special trains

మహా కుంభమేళా స్పెషల్ ట్రైన్లను ఆపేసిన ఇండియన్ రైల్వే

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు కోట్లాది మంది వస్తుండటంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మహా కుంభమేళా స్పెషల్‌ ట్రైన్లను ఇండియన్‌ రైల్వే నిలిపివేసింది. తర్వాతి ఆదేశాలు వచ్చేంత వరకు ఆపేస్తున్నట్టు తెలిపింది. రెగ్యులర్‌ ట్రైన్లు యథావిధిగా నడుస్తాయని వెల్లడించింది. మౌని అమావాస్య రోజున ప్రయాగ్‌రాజ్‌లో రద్దీ దృష్ట్యా, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుండి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మహాకుంభమేళా ప్రత్యేక రైళ్ల ఆపరేషన్‌ను నిలిపివేశారు.

Advertisements

దీంతో జంక్షన్‌లో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే భక్తుల రద్దీ నెలకొంది. వివిధ మార్గాల్లో నడిచే మిగిలిన కుంభమేళా ప్రత్యేక రైళ్లు యథావిధిగా కొనసాగుతున్నాయి. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుండి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే కుంభమేళా ప్రత్యేక రైళ్లు మాత్రమే నిలిచిపోయాయి. కానీ సాధారణ రైళ్లు నడుస్తున్నాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రత్యేక రైలును నిలిపివేస్తున్నట్లు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ మనీష్ కుమార్ తెలిపారు.

image

మరోవైపు ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో తొక్కిసలాట జరగడంతో, ఇండియన్ రైల్వే అప్రమత్తమైంది. ప్రయాగ్‌రాజ్ జంక్షన్ వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), పోలీసు బలగాల మోహరింపు పెంచారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మౌని అమావాస్య స్నానానికి వచ్చే భక్తులను సురక్షితంగా సంగమానికి చేర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాకుంభంలో ఇప్పటి వరకు 13 కోట్ల మందికి పైగా భక్తులు స్నానాలు చేశారు. మౌని అమావాస్య పర్వదినాన దాదాపు 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానానికి తరలివచ్చారు.

Related Posts
మన్మోహన్ మృతి… వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం
Union Government is set to

భారతదేశ రాజకీయ చరిత్రలో అమూల్యమైన వ్యక్తిత్వం, సౌమ్యతకు ప్రతీకగా నిలిచిన మన్మోహన్ సింగ్ మృతి దేశాన్ని విషాదంలో ముంచింది. ఆయన భారత ఆర్థిక రంగానికి చేసిన సేవలు, Read more

విశాఖ ఉక్కు పూర్వ వైభవానికి కృషి : మంత్రి నిర్మలా సీతారామన్‌
Efforts to restore Visakhapatnam Steel to its former glory.. Minister Nirmala Sitharaman

న్యూఢిల్లీ: భారత్‌పై అమెరికా సుంకాల మోతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. సుంకాల విషయమై చర్చలకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అమెరికా వెళ్లారని Read more

ప్రియాంక గాంధీ బుగ్గలపై బీజేపీ వ్యాఖ్యలు
ప్రియాంక గాంధీ బుగ్గలపై బీజేపీ వ్యాఖ్యలు

కల్కాజీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్ బిధూరి, రోడ్లను ప్రియాంక గాంధీ వాద్రా బుగ్గల వంటి సున్నితంగా మార్చుతామని హామీ ఇచ్చారు. ఆయన Read more

Hyderabad: ₹10,500Cr AI డేటా క్లస్టర్‌కు ఒప్పందం
జపాన్ కంపెనీలతో హైదరాబాద్‌కు భారీ AI పెట్టుబడి

Hyderabad : రూ.10,500Cr AI డేటా క్లస్టర్ ఏర్పాటు Hyderabad : జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం హైదరాబాద్లో Read more

Advertisements
×