india remaining diplomats clearly on notice canada foreign minister melanie joly

భారత్పై మరోసారి అక్కసు వెల్లగక్కిన కెనడా..

న్యూఢిల్లీ: భారత్‌తో దౌత్య సంబంధాలు తీవ్ర స్థాయిలో దెబ్బతింటున్నా కూడా కెనడా వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మాటల్నే విదేశాంగ మంత్రి మెలానీ జోలీ వెల్లడించారు.

కెనడాలో ఉన్న మిగిలిన దౌత్యవేత్తలపై తాము ప్రత్యేక నిఘా ఉంచామంటూ భారత్‌పై బురద జల్లే ప్రక్రియను ఆమె కొనసాగించారు. అంతటితో ఆగకుండా భారత్‌ను రష్యాతో పోలుస్తూ అక్కసును వెళ్లగక్కింది. భారత దౌత్య వేత్తలు వియన్నా కన్వెన్షన్‌ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదని మెలానీ జోలీ కామెంట్స్ చేసింది.

ఇంకా మెలానీ జోలీ మాట్లాడుతూ.. కెనడా దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదన్నారు. మన దేశ గడ్డపై విదేశీ అణచివేత జరగదు అని తేల్చి చెప్పారు. ఐరోపాలో ఇలాంటి ఘటనలు చూశాం.. జర్మనీ , బ్రిటన్‌లో రష్యా విదేశీ జోక్యానికి పాల్పడింది అనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మేం ఈ విషయంలో చాలా దృఢంగా ఉన్నామని వెల్లడించారు. కాగా, హర్థీప్ సింగ్ నిజ్జర్‌ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ పేరును కెనడా సర్కార్ చేర్చింది. అతడ్ని విచారించాల్సి ఉందని భారత విదేశాంగ శాఖకు కెనడా మెసేజ్ చేసింది. ఇక, దీనిపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించింది.

Related Posts
వియత్నాం రాష్ట్రపతిగా లుయాంగ్ క్యూంగ్
DT Luongcuong

2024 అక్టోబర్ 21న లుయాంగ్ క్యూంగ్ (Luong Cuong) వియత్నాం రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 2021-2026 కాలానికి 15వ జాతీయ అసెంబ్లీ 8వ సమావేశంలో ఆయనను ఈ పదవికి Read more

కేపీహెచ్‌బీలో ఘోర అగ్నిప్రమాదం
fire accident in kphb colony hyderabad

హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీ కాలనీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ టిఫిన్ సెంటర్‌లో అర్ధరాత్రి ఒక్కసారిగా చెలరేగిన మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి Read more

ఢిల్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌కు షాక్‌..
A shock to Kejriwal before the Delhi elections

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఆ రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు Read more

26/11 అమరవీరులకి రాష్ట్రపతి ఘన నివాళి
President Droupadi Murmu 26 11

దేశాన్ని వణికించిన 26/11 ముంబై దాడి సంఘటనను దేశంలో ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటారు.ఈ దాడిలో భయానకమైన హింస సంభవించి, అనేక నిర్దోషులను ప్రాణాలు కోల్పోయేలా చేసింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *