అవినీతి లో భారత్ కు 96 వ ర్యాంకు

అవినీతి లో భారత్ కు 96 వ ర్యాంకు

ప్రపంచంలోనే అత్యంత అవినీతి గల దేశాల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో భారత్‌ స్థానం మరోసారి దిగజారింది. 2024కు సంబంధించి కరప్షన్ పెర్సెప్షన్స్ ఇండెక్స్ ను ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ తాజాగా విడుదల చేసింది. మొత్తం 180 దేశాలకు సంబంధించిన అవినీతి సూచీని విడుదల చేసింది. ఈ సూచీలో భారత్‌ 96వ స్థానంలో నిలిచింది.
అవినీతిరహిత దేశంగా డెన్మార్క్
ఈ సూచీలో 0-100 వరకూ స్కోర్‌ ఉంటుంది. సున్నా స్కోర్‌ ఉంటే పూర్తిగా అవినీతిగా.. 100 స్కోర్‌ సాధిస్తే అవినీతి రహితమైనదిగా పరిగణిస్తారు. ఈ జాబితాలో డెన్మార్క్‌ మొదటి స్థానంలో నిలిచింది. 100కు 90 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. డెన్మార్క్‌ తర్వాత 88 పాయింట్లతో ఫిన్లాండ్‌ రెండో స్థానంలో ఉంది. ఇక 84 పాయింట్లతో సింగపూర్‌ మూడో స్థానంలో, 83 పాయింట్లతో న్యూజిలాండ్‌ నాలుగోస్థానంలో , 81 పాయింట్లతో లక్సంబర్గ్‌ ఐదో స్థానంలో నిలిచాయి.

అవినీతి లో భారత్ కు 96 వ ర్యాంకు


మరింత దిగజారిన భారత్ ర్యాంకు
ఇక ఈ జాబితాలో భారత్‌ 38 పాయింట్లతో 96వ స్థానంలో నిలిచింది. గతంతోపోలిస్తే భారత్‌ మూడు స్థానాలకు పడిపోయింది. 2023లో 39 పాయింట్లతో 93వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఇక 2022లో 40 పాయింట్లతో 85వ స్థానంలో నిలవగా.. తాజాగా 96వ స్థానంలో నిలవడం గమనార్హం. భారత్‌ పొరుగు దేశాలైన పాకిస్థాన్ 27 పాయింట్లతో 135వ ర్యాంకు‌, శ్రీలంక 32 పాయింట్లతో 121వ ర్యాంకు, బంగ్లాదేశ్‌లు 149వ ర్యాంకులో నిలిచాయి.
అత్యంత అవినీతిమయమైన దేశంగా సౌత్‌ సుడాన్‌
ఇక ఈ జాబితాలో అత్యంత అవినీతిమయమైన దేశంగా సౌత్‌ సుడాన్‌ నిలిచింది. ఈ జాబితాలో సౌత్‌ సుడాన్‌ 180వ ర్యాంక్‌తో 08 స్కోర్‌ సాధించింది. ఆ తర్వాత సొమాలియా (09 స్కోర్‌)‌, వెనుజులా (10)‌, సిరియా (12), యోమన్‌ (13), లిబియా (13), ఈక్వటోరియల్‌ గునియా (13), నికరాగ్వా (15)తో అత్యంత అవినీతిమయమైన దేశాలుగా నిలిచాయి

Related Posts
2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రోడ్డు ప్రమాదంలో మరణించారు..
harshabardhan

కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి హర్ష్ బర్ధన్ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన తన మొదటి పోస్టింగ్ కోసం హసన్ జిల్లాకు వెళ్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న Read more

సౌర చక్రం 2025: భూమి పై ప్రభావాలు
సౌర చక్రం 2025: భూమి పై ప్రభావాలు

సౌర చక్రం 2025: భూమి పై ప్రభావాలు అధిక సౌర కార్యకలాపాలు అరోరాలు, సూర్య మంటలు మరియు భూయాంత్రిక రుగ్మతలను తీసుకురావచ్చు. 2025లో, సౌర గరిష్ట కార్యకలాపాలు Read more

భక్త జనసంద్రంగా ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళా
Maha Kumbh Mela has started.. Prayagraj is crowded with devotees

ప్రయాగ్‌రాజ్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతీ నదులు కలిసే ప్రదేశమైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. Read more

వామ్మో.. మేక ఖరీదు అన్ని లక్షలా..? ఏంటో అంత ప్రత్యేకం
Goat Kid Sold In 14 lakh Ru

ఏంటీ ధర చూసి అవాక్కయ్యారా? ఇది మామూలు మేక కాదు మరి. అసాధారణమైన పొడవాటి చెవులు వంటి ప్రత్యేక లక్షణాలకు ఈ మేక ప్రసిద్ధి చెందింది. దీని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *