గ్యాస్ వినియోగదారులకు షాక్..

నెల మారిందంటే చాలు అనేక మార్పులు జరుగుతుంటాయి. నిత్యా అవసర ధరలు , గ్యాస్ సిలిండర్ ధర , పెట్రోల్ డీజిల్ ధరలు , బ్యాంకు వడ్డీలకు సంబంధించి మార్పులు ఇలా ఎన్నో జరుగుతాయి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు అనేవి ప్రతి నెల జరుగుతుంటాయి. ఇక ఇప్పుడు సెప్టెంబర్ నెల మొదలు కావడం తో గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి చమురు సంస్థలు.

హోటల్స్​, రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కేజీల కమర్షియల్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.39 మేర పెంచుతున్నట్లు వెల్లడించాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచే కొత్త ధరలు అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. డొమెస్టిక్ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి.

గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించిన నేపథ్యంలో, దేశ రాజధాని దిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.39 పెరిగి రూ.1691.50కు చేరుకుంది. అంతకుముందు ఆగస్టులో గ్యాస్ బండ ధరను రూ.6.5 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర అప్పుడు దిల్లీలో రూ.1,652.50గా మారింది. ఇప్పుడు మరో రూ.39 పెరగడం వల్ల రూ.1691.50కు చేరింది.