ఆదాయ పన్ను బిల్లు :నిర్మలసీతారామన్

ఆదాయ పన్ను బిల్లు :నిర్మలసీతారామన్

దేశంలో ఆర్ధిక మందగమన పరిస్ధితుల నేపథ్యంలో తాజాగా పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్దిక మంత్రి వేతన జీవులకు గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ఏకంగా 12 లక్షలకు పెంచడం ద్వారా మధ్యతరగతికి భారీ ఊరటనిచ్చారు. అలాగే కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్ లను మార్చారు. అదే సమయంలో కొత్తగా ఆదాయపు పన్ను బిల్లు తీసుకొస్తామని ప్రకటన చేశారు. అన్నట్లుగానే ఇవాళ కొత్త బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్నారు.

1643792978 nirmala sitharaman biography

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ కొత్త ఆదాయపు పన్ను బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సిద్దమవుతున్నారు. చివరి నిమిషంలో మార్పు ఉంటే తప్ప ఇవాళ లోక్ సభలో ఈ బిల్లు తీసుకురావడం ఖాయమైంది. అయితే ఇందులో ఏముందనే చర్చ వేతన జీవుల్లో మొదలైంది. దేశంలో ప్రత్యక్ష పన్ను చట్టాలను సరళీకృతం చేయడం ఈ బిల్లు లక్ష్యం. అయితే ఇందులో ఎలాంటి కొత్త పన్ను భారాలు ఉండకపోవచ్చని కేంద్రం సంకేతాలు ఇచ్చింది. అయితే చట్టాన్ని పన్ను చెల్లింపుదారులకు మరింత చేరువ చేసేందుకు పలు మార్పులు తీసుకురానుంది.

మరోవైపు తాజాగా కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాటతో పాటు అమెరికా నుంచి భారీగా వలసదారుల్ని స్వదేశానికి బేడీలు వేసి మరీ పంపేస్తుండటంపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీసే అవకాశాలున్నాయి. అలాగే శ్రీలంక నేవీ భారతీయ మత్స్యకారులను అరెస్టు చేయడంపైనా విపక్షాలు కేంద్రాన్ని ఇరుకునపెట్టబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆర్థికమంత్రి సిద్దమవుతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ తొలి భాగం జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత మార్చి 10న తిరిగి సమావేశమై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుంది.

ముఖ్యమైన మినహాయింపులు:
వివిధ ఆదాయ వర్గాలకు కొన్ని మినహాయింపులు మరియు సౌకర్యాలను అందించే విధంగా మార్పులు చేసినట్లు చెప్పవచ్చు.

లావాదేవీ పన్ను:
ఈ బిల్లులో లావాదేవీ పన్నును విధించడంలో కొన్ని సంస్కరణలు అమలు చేయబడతాయి, తద్వారా వాణిజ్య రంగం మరింత సమర్థవంతంగా మరియు పారదర్శకంగా అభివృద్ధి చెందుతుంది.

లావాదేవీ పన్ను:
ఈ బిల్లులో లావాదేవీ పన్నును విధించడంలో కొన్ని సంస్కరణలు అమలు చేయబడతాయి, తద్వారా వాణిజ్య రంగం మరింత సమర్థవంతంగా మరియు పారదర్శకంగా అభివృద్ధి చెందుతుంది.

Related Posts
సుప్రీంకోర్టులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట
udhay stalin

తమిళనాడు ఉపముఖ్యమంత్రి మరియు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు Read more

జాతీయ గణిత దినోత్సవం: విద్యలో సాంకేతికత
జాతీయ గణిత దినోత్సవం: విద్యలో సాంకేతికత

జాతీయ గణిత దినోత్సవం: గణిత విద్యలో సాంకేతికత ప్రగతి గణితము అనేది శాస్త్రీయ మరియు సాంకేతిక అభివృద్ధికి పునాది, ఎందుకంటే ఇది వాటిని అర్థం చేసుకోవడానికి మరియు Read more

మణిపూర్ సమస్యపై ప్రధాని మోడీ వైఖరి – రిజిజు స్పందన
మణిపూర్ సమస్యపై ప్రధాని మోడీ వైఖరి – రిజిజు స్పందన

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మణిపూర్‌లోని సమస్యలకు ప్రధాని నరేంద్ర మోడీ ఆచరణాత్మక పరిష్కారం కోరుతున్నారని తెలిపారు. జాతి హింస ఫలితంగా ఏర్పడిన సమస్యను ప్రభుత్వం తీర్చడానికి Read more

వైద్య సంరక్షణపై సుప్రీంకోర్టు ఆందోళన
మైనర్‌పై అత్యాచారం..40 ఏళ్ల కు కామాంధుడికి శిక్ష విధించిన సుప్రీం కోర్టు

ప్రైవేట్ ఆసుపత్రులలో సరసమైన వైద్య సంరక్షణ అందకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి సంకేతమని సుప్రీంకోర్టు న్యాయస్థానం అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సరసమైన వైద్య సదుపాయాలను అందించడంలో విఫలమయ్యాయని Read more