Incentives for those investing in the tourism sector: CM Revanth Reddy

ప‌ర్యాట‌క రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు: సీఎం

భవిష్యత్తుకు బాట‌లు వేసేలా ప‌ర్యాట‌క శాఖ‌ను తీర్చిదిద్దాలి..

హైదరాబాద్‌: రాష్ట్రానికి ఆదాయంతో పాటు ఉపాధి క‌ల్పించే వ‌న‌రుగా ప‌ర్యాట‌క శాఖ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప‌ర్యాట‌క శాఖ‌పై కమాండ్ కంట్రోల్ సెంటర్​లో సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వహించారు. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు కల్పించాలని తెలిపారు. నాగార్జున సాగ‌ర్‌ బ్యాక్ వాట‌ర్‌లో బోట్ హౌస్‌ అందుబాటులో ఉంచాల‌ని, డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ల‌కు తెలంగాణ‌ను వేదిక‌గా మార్చాల‌ని సీఎం సూచించారు.

ప‌ర్యాట‌క రంగం పెట్టు బడులు

ఆల‌యాలు, పులుల అభ‌యార‌ణ్యాల‌కు ప‌ర్యాట‌కంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంద‌ని, ఆ దిశ‌గా దృష్టిసారించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. భ‌ద్రాచ‌లం, సలేశ్వరం, రామ‌ప్ప వంటి ఆల‌యాలు, మల్లెల తీర్ధం, బొగ‌త జ‌ల‌పాతాలు, బౌద్ధ స్తూపాలు, జైన ఆల‌యాలు ఇలా ప్రతీ ప‌ర్యాట‌క ప్రదేశంలో వ‌స‌తులు మెరుగుపరచడంతో పాటు స‌రైన ప్రచారం క‌ల్పించాల‌ని అధికారుల‌కు సూచించారు. భువ‌న‌గిరి కోట రోప్​వే ప‌నుల‌పై ఆరా తీశారు. భూ సేక‌ర‌ణ పూరయిందని త్వరలో టెండ‌ర్లు పిలుస్తామ‌ని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. భువ‌న‌గిరి కోట రోప్‌వే ప‌నుల‌కు త్వరగా టెండ‌ర్లు పిల‌వ‌డంతో పాటు అక్కడి చారిత్రక కట్టడాల పరిరక్షణకు అవ‌స‌ర‌మైన చర్యలు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు.

అట‌వీ, ఐటీ, విద్యుత్‌, టీజీఐఐసీ, వైద్య, క్రీడ‌ల శాఖ‌ల‌తో సమన్వయం చేసుకొని ప‌ర్యాట‌క శాఖ పాల‌సీకి తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఒక శాఖ విధానాలు మ‌రో శాఖ పాలసీలకు ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాహస క్రీడలకు ప‌ర్యాట‌క శాఖ‌లో ప్రాధాన్యం ఇవ్వాల‌న్నారు. వైద్య అవ‌స‌రాల‌కు విదేశాల నుంచి వ‌చ్చే వారికి ఇబ్బందులు లేకుండా ప‌ర్యాట‌కుల్లా వ‌చ్చిపోయేలా చర్యలు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు.

Related Posts
ప్రాణాలు తీసిన అతివేగం.. ముగ్గురు దుర్మరణం
accident

అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం మత్తులో డ్రైవింగ్, రూల్స్ పాటించకుండా చేసే డ్రైవింగ్.. ఇవన్నీ ప్రాణాపాయమే. అయినా సరే చాలా మంది మాట వినరు. మంచిని మైండ్‌కి Read more

ఏపీలో రేషన్​కార్డుదారులకు గుడ్​న్యూస్​ ..
ap ration shop

ఏపీలో రేషన్​కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్ లో నిత్యావసర ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రేషన్​ దుకాణాల్లో నేటి (అక్టోబర్​ Read more

Aruna D.K : భద్రత పెంపుపై సీఎం ఆలోచించాలి – డీకే అరుణ
హన్మకొండ బీజేపీ ఆఫీస్ లో ఎంపీ డీకే అరుణ మీడియా సమావేశం

బీజేపీ ఎంపీ డీకే అరుణ తన ఇంట్లోకి అనుమానాస్పద వ్యక్తి ప్రవేశించిన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. హాల్, కిచెన్, బెడ్‌రూమ్ వంటి ప్రదేశాల్లో ఆ వ్యక్తి వెతికినప్పటికీ, Read more

ఒకే నేరానికి 3 FIRలా?..పొలీసులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
patnam

లగచర్ల ఘటనలో BRS నేత పట్నం నరేందర్రెడ్డిపై మూడు FIRలు నమోదుచేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఫిర్యాదుదారు మారిన ప్రతిసారీ కొత్త FIR పెట్టడం ఎలా సమర్థనీయమని పోలీసులను Read more