Implementation of Section 144 in Tirupati.

తిరుపతిలో 144 సెక్షన్‌ అమలు..!

తిరుమల : తిరుపతిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో తిరుపతిలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఎస్వీ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Advertisements

మరోవైపు తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపించగా.. తాము క్షేమంగానే ఉన్నామని వారు వీడియోలు రిలీజ్ చేశారు. ఇది ఇలా ఉండగా.. అర్థరాత్రి తిరుపతిలో హైడ్రామా చోటు చేసుకుంది..అభినయ రెడ్డి దాడి చేశాడని అంటున్నారు. టీడీపీ నేత మబ్బు దేవనారాయణరెడ్డి ఇంట్లో తమ కార్పొరేటర్లు ఉన్నారంటూ మాజీ డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి దాడికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. తన అనుచరులతో బీభత్సం సృష్టించిన అభినయ రెడ్డి… దాడికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి.

image

కాగా, తిరుపతి జిల్లా నందు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నందు ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశం నిబంధనల మేరకు కోరం లేక పోవడం వలన వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి పట్టణం నందు 144 సెక్షన్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు అమలులో ఉంటుందని కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ దిశగా అదనపు బలగాలతో సుమారు 250 మందితో బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ నేటి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Related Posts
HAPPY BIRTHDAY రెబల్ స్టార్ ‘ప్రభాస్’
prabhas bday

బాహుబలి చిత్రంతో ప్రపంచ దేశాల్లో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన స్టార్ 'ప్రభాస్'. నాటి నుంచి పాన్ ఇండియా జైత్రయాత్ర మొదలుపెట్టిన ఆయన పుట్టిన రోజు నేడు. Read more

సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి నిందితుడు ఎలా ప్రవేశించాడు?
సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి నిందితుడు ఎలా ప్రవేశించాడు?

సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన కేసులో నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను ఆదివారం ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన జనవరి Read more

Muslim Law: ఘాటుగా స్పందించిన అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు
ఘాటుగా స్పందించిన అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు

దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కారణమైన వక్ఫ్ సవరణ బిల్లు లోక్‌సభకు వచ్చింది. కేంద్ర న్యాయ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు- దీన్ని సభలో Read more

20 లక్షల మందికి ఉపాధి: చంద్రబాబు
chandra babu

తమ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అంతేకాక కొత్త ఏడాదిలో రాష్ట్రంలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని Read more

Advertisements
×