ఎమ్మెల్యే, ఎంపీ కావాలంటే రూ.కోట్లు ఖర్చు పెట్టాలి: జగ్గారెడ్డి

ప్రస్తుతం రాష్ట్రంలో డబ్బులతోనే రాజకీయాలు నడుస్తున్నాయని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ కావాలంటే రూ. కోట్లలో కుమ్మరించాల్సి వస్తోందని మీడియా సమావేశంలో చెప్పారు. ఎన్నికల్లో పోటీకి కులం ముఖ్యం కాదని, డబ్బులే ముఖ్యమన్నారు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలనే మహేశ్ కుమార్కు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించారన్నారు. తాను ఎప్పటికైనా పీసీసీ చీఫ్ అవుతానని ధీమా వ్యక్తం చేశారు.

“సంగారెడ్డి జనరల్ (ఎమ్మెల్యే) సీటుకి రూ.50 కోట్లు ఖర్చు పెట్టాలి.. పటాన్‌చెరు ఎమ్మెల్యే సీటుకి రూ.100 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎంపీ సీటుకు కూడా రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లు ఖ‌ర్చు పెట్టాలి. ఇప్పుడు కులాలతో రాజకీయం నడవడం లేదు. పైసలు పెట్టాల్సి వస్తోంది. ఇప్పుడు ఏ కుల‌మో, ఏ మ‌త‌మో త‌ర్వాత‌… ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలంటే ఇప్పుడు కోట్లు పెట్టాలి. పైసలకు కులానికి ఇప్పుడు సంబంధం లేదు” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.